Dasari – NTR : ప్రాణమిత్రులైన ఎన్టీఆర్- దాసరి.. శత్రువులు అవ్వడానికి కారణం ఇదేనా?
Dasari – NTR : సినిమా రంగంలో నందమూరి తారక రామారావుకు పెద్దగా శత్రువులు ఎవరూ లేరు. అందరూ ఆయనతో స్నేహంగానే ఉండేవారు. అయితే, దర్శకరత్న దాసరి నారాయణ రావుగారు మొదట్లో ఎన్టీఆర్‌కు ప్రాణమిత్రులుగా ఉండేవారట.. కానీ ఏమైందో ఏమో తెలియదు. అన్నగారు పార్టీ పెట్టేసమయానికి వీరిద్దరూ బద్ద శత్రువులుగా మారిపోయారని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ నడిచింది. దీనికి కారణం ఏమై ఉంటుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Dasari – NTR : వీరి కాంబోలో భారీ హిట్లు..
దాసరి నారాయణ రావు గారు ఎన్టీఆర్‌తో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలోనే సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి లాంటి సూపర్ హిట్ సినిమాలను ఎన్టీఆర్‌తో చేశారు దాసరి. అయితే, ఈ సినిమాలు అన్నగారిని రాజకీయంగా ప్రేరేపించాయి.ఇక్కడ విచిత్రం ఏమిటంటే చిన్నతనం నుంచి దాసరికి ఏఎన్నార్ అంటే చాలా అభిమానం ఉండేదట.. ఆ తర్వాత అక్కినేనితో గ్యాప్ రావడంతో చివరకు దాసరి – ఎన్టీఆర్ బంధం బాగా బలపడిందని చెప్పుకుంటారు. ఆ తర్వాత కొంతకాలానికి వీరి మధ్య వైరం పెరిగింది. ఈ టైంలో అసలు దాసరికి షూటింగ్ కోసం స్టూడియోలు ఇవ్వద్దని ఎన్టీఆర్ కొందరికి చెప్పేవరకు వెళ్లిందట..
అన్నగారితో అనేక సినిమాలు తీసిన దాసరికి ఇలాంటి పరిస్థితులు వస్తాయని కూడా ఆనాడు ఎవరూ ఊహించలేదట.. దీనంతటికీ రాజకీయమే కారణం అని అంటున్నారు కొందరు. దాసరి ఇందిరమ్మ ఫ్యాన్. అంటే కాంగ్రెస్ పార్టీకి విదేయుడిగా ఉండేవాడట. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఇందిర దాసరికి ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది.అంతేకాకుండా ఈనాడులో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కథనాలు వస్తే దాసరి ఉదయం పత్రికను ప్రారంభించి అన్నగారికి వ్యతిరేకంగా వార్తలు రాయించి ఆయన రెండోసారి ఓడిపోవడానికి కూడా దాసరి కారణం అయ్యాడని కూడా అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.