Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ లో సీరియస్, ఢీ లో జోకులు.. అఖిల్ రెండు షోలు చూడలేక పోతున్నాం
Bigg Boss OTT Telugu : ఈటీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో ఢీ గత కొన్నాళ్లుగా సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుని టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది. కానీ ఈ సీజన్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోతుంది. పైగా ఈ సీజన్లో ఉన్న కామెడీ టీం మరియు టీం లీడర్ లు ఇంకా ఇతర టీం అంతా కూడా ప్రతి విషయంలో కూడా అసంతృప్తి కలిగిస్తున్నారు. సుడిగాలి సుధీర్ మరియు రష్మి గౌతమ్ వెళ్లిపోయిన తర్వాత ఢీ షో పూర్తిగా వెలవెల పోయింది అనడంలో సందేహం లేదు. ఆ లోటును భర్తీ చేసేందుకు యాంకర్ ప్రదీప్ మరియు హైపర్ ఆది తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.. చేశారు… చేయబోతున్నారు. కానీ ఏ ఒక్కటి కూడా వర్కవుట్ అవుతుందా దాఖలాలు కనిపించడం లేదు.
గత సీజన్ కు వచ్చిన సరాసరి రేటింగ్ పోలిస్తే ఈ సీజన్ రేటింగ్ కనీసం అందులో సగం కూడా ఉండడం లేదు అనేది స్వయంగా ఈటీవీ వర్గాల వారు చెబుతున్న విషయం. హైపర్ ఆది ఇతర టీమ్ మెంబర్స్ చేస్తున్న కామెడీ పర్వాలేదనిపించినా సుధీర్, రష్మీ లేరు అనే భావన చాలా మందికి కలిగి కనీసం షో ని కూడా చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇక ఇదే సమయంలో బిగ్బాస్ నాన్ స్టాప్ లో అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ సందడి చేస్తున్న అఖిల్ మరోవైపు ఢీ షో లో కూడా కనిపించడం ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పించే అంశంగా చెప్పుకోవచ్చు.ఢీ షో లో హైపర్ ఆది చేతిలో అత్యంత దారుణమైన అవమానపడుతూ అఖిల్ నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు.

akhil sarthak Dhee dance show and Bigg Boss OTT Telugu nonstop at a time
అదే బిగ్బాస్ నాన్ స్టాప్ లో మాత్రం సీరియస్ గా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒకవైపు ఫన్నీ ఫెలో గా మరో వైపు సీరియస్ గా కనిపించేందుకు అఖిల్ ప్రయత్నాలు చేయడం విడ్డూరంగా ఉన్నాయి. ఆయన బిగ్బాస్ నాన్ స్టాప్ లోకి వెళ్లి దాదాపుగా రెండు నెలలు కావస్తోంది. ఆయినా కూడా ఢీ షో లో ఈయన సందడి చేయడం ఎలా సాధ్యం అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో మూడు నాలుగు నెలల క్రితం షూట్ చేసిన ఢీ ని ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎన్ని రోజులు అక్కడ ఇక్కడ రెండు విభిన్నమైన కోణాల్లో అఖిల్ సార్ధక్ ని చూడాలి అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.