Dhee Dance Show : ఢీ డాన్స్‌ షో ప్రేక్షకులను మళ్లీ నిరాశ పర్చిన మల్లెమాల ఈటీవీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dhee Dance Show : ఢీ డాన్స్‌ షో ప్రేక్షకులను మళ్లీ నిరాశ పర్చిన మల్లెమాల ఈటీవీ

Dhee Dance Show : ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డ్యాన్స్ షో కార్యక్రమం సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే వారం నుండి కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అభిమానులను మల్లెమాల వారు నిరాశ పర్చారు. ఈటీవీ మరియు మల్లెమాల వారు గతంలో సుధీర్ రష్మి గౌతమ్ మరియు శేఖర్ మాస్టర్ లతో ఫన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మంచి డాన్స్ తో పాటు వారు చేసిన ఫన్ తో మంచి రేటింగ్‌ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 December 2022,1:00 pm

Dhee Dance Show : ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డ్యాన్స్ షో కార్యక్రమం సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే వారం నుండి కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అభిమానులను మల్లెమాల వారు నిరాశ పర్చారు. ఈటీవీ మరియు మల్లెమాల వారు గతంలో సుధీర్ రష్మి గౌతమ్ మరియు శేఖర్ మాస్టర్ లతో ఫన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మంచి డాన్స్ తో పాటు వారు చేసిన ఫన్ తో మంచి రేటింగ్‌ నమోదు అయ్యింది. గత సీజన్ కు వారు లేరు. ఈసారి వారు ఉంటారా లేదా అనే అనుమానాలు నిన్న మొన్నటి వరకు ఉండేవి.

గత సీజన్ లో వీరు లేక పోవడంతో రేటింగ్ చాలా తక్కువగా నమోదు అయింది. అందుకే కొత్త సీజన్ కోసం వారిని కచ్చితంగా తీసుకొస్తారని.. సుధీర్ మరియు రష్మి గౌతమ్ ల జోడి మళ్లీ సందడి చేయడం ఖాయం అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కొత్త సీజన్ ప్రారంభం కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది, అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల అయింది. ఆ ప్రోమోలో ఎక్కడ సుధీర్ మరియు రష్మి గౌతమ్ కనిపించకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Dhee Dance Show interesting update

Dhee Dance Show interesting update

వారిద్దరు మాత్రమే కాకుండా శేఖర్ మాస్టర్ కూడా ఈ సీజన్ కి అందుబాటులో ఉండడం లేదని తేలి పోయింది. ఈ ముగ్గురి జోడి లేకపోతే కార్యక్రమాన్ని చూడాలనిపించడం లేదు అంటూ అభిమానులు చాలా మంది సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు. అయినా కూడా మల్లెమాల వారు మీరు చూస్తే చూడండి లేకపోతే లేదు అన్నట్లుగా కొత్త వారిని తీసుకొచ్చింది. ఈ సీజన్ లో ప్రభుదేవా ఉంటాడా అన్నట్లుగా మొదటి ఎపిసోడ్ లో ఆయన సందడి చేశాడు. మరి పూర్తి సీజన్ లో ఉంటాడా లేదంటే గెస్ట్ గా వచ్చి వెళ్లిపోతాడా అనేది చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది