Pawan Kalyan : బాక్సింగ్ చేస్తోన్న అకీరా నందన్.. అందుకే అంటున్న పవన్ కళ్యాణ్ అభిమానులు
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూదేశయ్ ల కుమారుడు అకీరా నందన్ బాక్సింగ్ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. అయితే అకీరా నందన్ ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించకపోయిన పవర్ స్టార్ కొడుకుగా సోషల్ మీడియాలో ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. తల్లిదండ్రులు పవన్ రేణు దేశాయ్ విడిపోయిన తర్వాత తల్లి రేణు దేశాయ్ వద్ద అకీరా ఉంటున్న సంగతి తెల్సిందే. తల్లి వద్ద పెరుగుతున్నా అకీరా విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా శ్రద్ద కనబర్చుతూ ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే అకీరా నందన్ తండ్రి బాటలోనే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నాడు. పవన్ కల్యాణ్ ఇప్పటిదాకా అనేక రకాల మార్షల్ ఆర్ట్స్ సాధన చేయడమే కాకుండా, తన సినిమాల ద్వారా టాలీవుడ్ కు ఐకిడో, వుషు వంటి పోరాట విద్యలను పరిచయం చేశారు. అకీరా కూడా బాక్సింగ్ లో శిక్షణ పొందుతున్నప్పటి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అకీరా నందన్ తన ట్రైనర్ తో కలిసి స్పారింగ్ (సాధన) చేస్తుండడాన్ని చూడొచ్చు.

Akira Nandan boxing in why Pawan Kalyan fans are saying
జాబ్, రైట్ హుక్ కాంబినేషన్ లో పంచ్ లు విసురుతూ బాక్సింగ్ లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అకీరా పుట్టినరోజు కాగా పవర్ స్టార్ అభిమానులు ఈ వీడియో చూసి మురిసిపోతున్నారు.అయితే అకిరాను టాలీవుడ్ ఎంట్రీ ఎస్తాడని ఇండస్ట్రీ లో టాక్ గట్టిగానే నడుస్తుంది. కాగా అకీరా నందన్ బర్త్ డే సందర్బంగా సినీ ఎంట్రీ పై రేణు దేశాయ్ తాజాగా స్పందించింది. అకిరా నందన్ బాక్సింగ్ చేస్తోన్న వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ బాక్సింగ్ సినిమా కోసం కాదని తనకి నటుడు అవ్వాలని ఇంట్రెస్ట్ ఏ మాత్రం లేదని తెలిపింది రేణు దేశాయ్ తెలిపింది.
View this post on Instagram