
Akkineni Nagarjuna Still Faces Problems With Samantha
Samantha : అక్కినేని కోడలిగా సమంత మారిందనే విషయం అభిమానులని ఎంతగా సంతోషపరిచిందో, వారు విడిపోయారన్న విషయం అంతగా బాధించింది. వీరు విడిపోయి దాదాపు ఏడాది కావొస్తుంది. ఇద్దరు ఎవరి దార్లలో వారు పయనిస్తున్నారు. అయినప్పటికీ ఈ ఇద్దరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో నాగ చైతన్య హీరోయిన్, శోభిత దూళిపాళ్లతో ప్రేమాయణం నడుపుతున్నాడని రెండో వివాహం చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. చాలా కాలానికి ఆ ప్రచారం సమసిపోయింది కూడా. ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రచారం మొదలైంది. అదేమిటంటే సమంత రెండో పెళ్లికి సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది.
తమిళనాడుకు చెందిన ఒక వ్యాపారవేత్తతో ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని, దీనికి ఆమె బాగా విశ్వసించే ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ కారణమయ్యారని తెలుస్తోంది.సమంత మొదటి పెళ్లి పెటాకులయి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయన సమంతకు ఆధ్యాత్మికంగా కొన్ని మంచి విషయాలు చెప్పి ప్రేరేపించారని, దీంతో సమంతకు రెండో వివాహం చేసుకోవాలని కూడా ఆయనే సలహా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ అమ్మడు రెండో పెళ్లికి సంబంధించిన వార్త బయటకు రానుందని సమాచారం. అయితే ప్రస్తుతం సమంత అమెరికాలో ఉందని, స్కిన్ ట్రీట్‌మెంట్ కోసం అక్కడికి వెళ్లిందని టాక్.
Akkineni Nagarjuna Still Faces Problems With Samantha
అయితే సమంత చైతూలకు విడాకులు అవ్వడం వల్ల ఇప్పుడు నాగార్జున నానా కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత నాగచైతన్యకు సంబంధించిన ప్రతి విషయాన్ని సమంత దగ్గరుండి చూసుకునేవారట. అంతే కాకుండా ఆర్థిక లావాదేవీలు…. సినిమా డేట్స్ సైతం సమంత చూసుకునేదట. ఇక సమంత చైతూకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె పని ఆమె చూసుకుంటుంది. దాంతో ఇప్పుడు చైతూ డైట్, ఆర్థిక వ్యవహారాలు, సినిమా డేట్స్, కథల ఎంపిక బాధ్యతలను నాగార్జున చూసుకోవాల్సి వస్తుందట.కాగా, నాగార్జున త్వరలో ఘోస్ట్ చిత్రంతో పలకరించబోతున్న విషయం తెలిసిందే.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.