Sri Leela Is Leaving DJ Tillu 2 Project
Dj Tillu : ఇటీవలి కాలంలో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం డీజే టిల్లు.ఈ సినిమా సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్‌తో రూపొంది ఊహించని విధంగా భారీ కలెక్షన్లని సాధించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై అంచనాలు నెలకొన్నాయి. అందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని అందుకుంది. ఆమె ఓకే చెప్పడమే కాదు, ఏకంగా షూటింగ్ వరకు వెళ్లిందట. కానీ ఊహించని విధంగా `డీజే టిల్లు 2` నుంచి శ్రీ లీల వైదొలిగినట్టు సమాచారం.
షూటింగ్ స్టార్ట్ అయిన రెండు రోజులకే శ్రీలీల ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈమె వైదొలగడానికి కారణాలు ఏంటనేది తెలియడం రాలేదు. అయితే ఇప్పుడు శ్రీ లీల బయటకు వెళ్లిపోవడంతో మరో హీరోయిన్ కోసం చిత్ర బృందం అన్వేషిస్తుందట. ప్రస్తుతం హీరోయిన్‌ని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిద్ధు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
Sri Leela Is Leaving DJ Tillu 2 Project
`పెళ్లి సందడి` సినిమాతో ఆకట్టుకున్న శ్రీ లీలకి వరుసగా అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోలతోనూ ఆఫర్లు వచ్చాయి. ఓవర్ నైట్‌లో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. శ్రీలీల చేతిలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి. మాస్ మహారాజా రవితేజతో `ధమాకా` చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. దీంతోపాటు `అనగనగా ఒక రోజు` చిత్రంలో నటిస్తుంది. అలాగే గాలి జనార్థన్‌రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం. మరోవైపు ప్రభాస్‌తో మారుతి చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఓ కథానాయికగా నటించబోతుందని సమాచారం. ఇంత బిజీగా ఉన్న ఈ హీరోయిన్‌కి ఆ ఛాన్స్ మిస్ అయిన పెద్ద ఫరక్ పడకపోవచ్చు.
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
This website uses cookies.