Akkineni Nageswara Rao : ఒకప్పటి సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. దేవదాసు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అక్కినేని నాగేశ్వరరావు చనిపోయే వరకు కూడా సినిమాలు చేశారు. మనం ఆయన చివరి చిత్రం కాగా, ఇది అక్కినేని మనసులలో అలా నిలిచిపోయింది. అయితే తన కెరీర్ లో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో భారీ స్థాయి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ దిగ్గజ హీరో నటించినటువంటి అలనాటి ఓ చిత్రం ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత విడుదలకి సిద్ధం అయింది.
అక్కినేని నాగేశ్వరావు, జయసుధ కలిసి 1982లో ‘ప్రతిబింబాలు’ అనే చిత్రంలో నటించారు. అయితే ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేదు. సింగీతం శ్రీనివాసరావు దీనికి దర్శకత్వం వహించగా జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. 40 ఏళ్ల తరువాత మేకర్స్ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఏఎన్నార్ జయంతి సెప్టెంబర్ 20న ప్రతిబింబాలను రిలీజ్ చేయడానికి పూర్తిగా సన్నద్ధమయ్యారు. సినిమా మంచి హిట్ సాధింస్తుందని చిత్ర యూనిట్ అనుకుంటుంది.
ఇన్నాళ్ళకి ఈ ఏడాది సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జయంతి సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమా ఇపుడు రిలీజ్ అనేది అక్కినేని అభిమానులకి అయితే మూవీ లవర్స్ కి ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది అని చెప్పాలి. ప్రస్తుత సాంకేతికతను మిళితం చేసి, సరికొత్త హంగులతో సెప్టెంబరు 20న అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి పురస్కరించుకుని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అని నిర్మాతలు తెలిపారు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.