Akkineni Nageswara Rao : 40 ఏళ్ల క్రితం నాటి ఏఎన్నార్ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందా?

Authored By Sam C | The Telugu News | Published on: August 18, 2022, 12:40 pm

Akkineni Nageswara Rao : ఒక‌ప్పటి సీనియ‌ర్ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ఎన్నో వైవిధ్య‌మైన సినిమాలు చేశారు. దేవ‌దాసు సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు చనిపోయే వ‌ర‌కు కూడా సినిమాలు చేశారు. మ‌నం ఆయ‌న చివ‌రి చిత్రం కాగా, ఇది అక్కినేని మ‌న‌సుల‌లో అలా నిలిచిపోయింది. అయితే తన కెరీర్ లో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో భారీ స్థాయి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ దిగ్గజ హీరో నటించినటువంటి అలనాటి ఓ చిత్రం ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత విడుదలకి సిద్ధం అయింది.

Akkineni Nageswara Rao : చాలా ఏళ్ల త‌ర్వాత‌

అక్కినేని నాగేశ్వరావు, జయసుధ కలిసి 1982లో ‘ప్రతిబింబాలు’ అనే చిత్రంలో నటించారు. అయితే ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేదు. సింగీతం శ్రీనివాసరావు దీనికి దర్శకత్వం వహించగా జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. 40 ఏళ్ల తరువాత మేకర్స్ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఏఎన్నార్ జయంతి సెప్టెంబర్ 20న ప్రతిబింబాలను రిలీజ్ చేయడానికి పూర్తిగా సన్నద్ధమయ్యారు. సినిమా మంచి హిట్ సాధింస్తుందని చిత్ర యూనిట్ అనుకుంటుంది.

Akkineni Nageswara Rao movie release on september 20

Akkineni Nageswara Rao movie release on september 20

ఇన్నాళ్ళకి ఈ ఏడాది సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జయంతి సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమా ఇపుడు రిలీజ్ అనేది అక్కినేని అభిమానులకి అయితే మూవీ లవర్స్ కి ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది అని చెప్పాలి. ప్రస్తుత సాంకేతికతను మిళితం చేసి, సరికొత్త హంగులతో సెప్టెంబరు 20న అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి పురస్కరించుకుని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అని నిర్మాత‌లు తెలిపారు.

Sam C

No bio available for this author.

  1. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  2. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  3. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  4. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  5. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  6. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  7. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp