Ali coments on suma
Ali : సీనియర్ నటుడు బ్రహ్మాజీ, కమెడియన్ ఆలీ ఓ విషయంలో తలపడబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ తలపడబోతున్నట్లుగా వీరు కూడా ఫైట్ చేసుకుంటున్నారు. అది ఎక్కడంటే..ప్రతీ ఆదివారం స్టార్ మాలో ప్రసారమయ్యే సరాదా సమయం ‘స్టార్ట్ మ్యూజిక్’ ప్రోగ్రాంకు ఆలీ, బ్రహ్మాజీ అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా షోలో ‘ఆర్ఆర్ఆర్’ ‘దోస్తీ’ బ్యాక్ గ్రౌండ్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు.
Ali coments on suma
ఈ షోకు సుమ యాంకర్ కాగా, ఆమెపై పంచులు వేసి ఆలీ, బ్రహ్మాజీ షోలో ఆనందంగా టాస్కులు పూర్తి చేసినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వారు ఇన్ స్టా గ్రామ్ వేదికగా విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్‌లో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకరి చేతులను మరొకరు పట్టుకుని స్టిల్ ఇచ్చిన మాదిరిగా ఆలీ, బ్రహ్మాజీ స్టిల్ ఇచ్చారు. అది చూసి సుమ నవ్వుకుంది. ఇకపోతే సుమ నటుడు బ్రహ్మాజీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయనకొక కురువృద్ధుడని, భీష్మాచార్యుల వంటి వారని చెప్పింది.
Anchor Suma Fun In Maldives Five Star Hotel
అంతకు ముందర ఆలీ, బ్రహ్మాజీ షోలో మాట్లాడుతూ ఓ పెద్దావిడ ఉండేది కన్నంబ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఆవిడే పెద్ద దిక్కు అని సుమను ఉద్దేశించి చెప్పారు. ఆ మాటలు విని సుమ నవ్వుకోవడంతో పాటు కౌంటర్ అటాక్ ఇచ్చేసింది. ఇకపోతే సుమ బ్రహ్మాజీ గురించి చెప్పబోతున్న క్రమంలో ఆలీ జోక్యం చేసుకుని కాడెద్దులో ఒక ఎద్దు బ్రహ్మాజీ అని చెప్పు నవ్వులు పూయించారు. మొత్తంగా ప్రోమోను చూస్తే చాలా ఎంటర్‌టైనింగ్‌గా షో జరిగినట్లు అర్థమవుతున్నది. ఈ షో ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతుంది. ఇకపోతే ‘స్టార్ట్ మ్యూజిక్’ ప్రోగ్రాం ప్రోమో చూసి నెటిజన్లు ఇంట్రెస్టింగ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘బిగ్ బాస్’ షో మాదిరిగా సెట్ ఉందని అభిప్రాయపడుతున్నారు.
comedian ali : కమెడియన్ ఆలీ ఆస్తుల విలువ మీకు తెలుసా?
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.