Sri Reddy : పంజాబీ అమ్మాయి పనులన్ని పెన్ డ్రైవ్ లో వున్నాయి.. పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
Sri Reddy : తెలుగు ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్‌గా ఉండే నటి శ్రీరెడ్డి తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్, హీరోయిన్ పూనమ్ కౌర్, ప్రొడ్యూసర్ దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం, వైసీపీ మంత్రులపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో పెద్ద రాజకీయ దుమారమే రేగింది. వైసీపీ మంత్రులు, సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణ మురళి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు తన ఇంటిపై దాడి చేశారని సినీ నటుడు పోసాని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడటంతో పాటు తీవ్రంగా దూషించారు.
Sri reddy comments on pawan kalyan poonam kaur
Sri Reddy : నేను పవన్ కల్యాణ్ కంటే జగమొండిని..
ఇకపోతే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తాజాగా శ్రీరెడ్డి స్పందించింది. శ్రీరెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని గురించి అపహస్యం చేసి మాట్లాడటం సరికాదని పేర్కొంది. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ఉద్దేశించి దూషించింది. తాను పవన్ కంటే జగమొండినని శ్రీరెడ్డి చెప్పింది. పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తు, సినిమా భవిష్యత్తు ఉండబోదని విమర్శించింది. తాను ఆది శక్తినని, తను పూజించే ఆదిశక్తి ప్రకారంగా పవన్ కల్యాణ్ చేసిన పాపాలే ఆయన్ను చుట్టుకుంటాయని ఆరోపించింది. హీరోయిన్ పూనమ్ కౌర్‌కు సంబంధించిన వివరాలు బయటపెడతానని, తాను గతంలో చెప్పానని,ఆమెకు సంబంధించిన ఆధారాలు పెన్ డ్రైవ్ లో తన వద్ద ఉన్నాయని శ్రీరెడ్డి చెప్పింది.
pawan kalyan Speech at Mangalagiri
ఇకపోతే టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్స్ హరీశ్ శంకర్, దేవ్ కట్టాపైన శ్రీరెడ్డి ఫైర్ అయింది. జగన్‌ను ఉద్దేశించి పవన్ మాట్లాడుతున్న క్రమంలో దిల్ రాజు, హరీశ్ శంకర్ నవ్వడాన్ని తప్పుబట్టింది. వారిని దూషించింది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. పవన్ కల్యాణ్ బహిరంగ సభలో తాట తీస్తా అని మాట్లాడిన మాటలు తప్పు అని శ్రీరెడ్డి పేర్కొంది. పవన్ కల్యాణ్ జనసైనికుల జీవితాలతో ఆడుకుంటున్నాడని విమర్శించింది.
poonam kaur coments on posani
