Ali : అలీకి రాజ్యసభ.. వారంలో కలుద్దామంటూ క్లారిటీ ఇచ్చిన జగన్..?
Ali: కమెడియన్ అలీకి టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం వైసీపీ మద్దతు దారుడిగా కొనసాగుతున్నారు. ఆయన వైసీపీ తరఫున ప్రచారం కూడా చేశారు. దాంతో ఆయన అప్పటి నుంచే జగన్‌కు సన్నిహితుడిగా మారిపోయారు. దీంతో అప్పటి నుంచే అలీకి ఏదో ఒక పోస్టు ఖాయం అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి అలీ వార్తల్లోకి ఎక్కారు. నిన్న చిరంజీవితో కలిసి టికెట్ల రేట్ల గురించి మాట్లాడేందుకు ఆయన జగన్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఈ అంశం తెరమీదకు వచ్చింది.
అయితే అలీ వెళ్లింది టికెట్ల రేట్ల అంశంపై చర్చించేందుకు అని అంతా అనుకుంటుండగా.. ఈ భేటీలోనే ఓ విషయం బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. మెజార్టీ పరంగా చూస్తే.. ఇవన్నీ వైసీపీ ఖాతాలోనే పడేటట్టు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఒకటి అలీకి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నిన్న అలీని పిలవడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు. అలాగే సినీ పెద్దలతో భేటీ అనంతరం జగన్ అలీతో ప్రైవేటుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆయనకు త్వరలోనే మళ్లీ కలుద్దాం అంటూ చెప్పారంట జగన్.

ali rajya sabha jagan who gave clarity to kaluddamantu during the week
Ali : ప్రైవేటుగా మాట్లాడిన జగన్..
మరో వారంలో కలుద్దాం అంటూ జగన్ చెప్పడంతో అలీకి రాజ్యసభ ఖాయం అంటున్నారు. పైగా కొన్ని రోజులుగా అలీ మద్దతుదారులు ఆయనకు రాజ్యసభ ఇవ్వాలంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. వీటన్నింటికీ బలం చేకూరుస్తూ అలీని వారంలో కలుద్దాం అనడం వెనక అసలు కారణం ఇదే అంటున్నారు చాలామంది. ప్రస్తుతం ఏపీలో ఒక మైనార్టీకి రాజ్యసభ ఇవ్వాలని జగన్ చూస్తున్నారంట. ఇలా అన్ని రకాలుగా అలీకి అనుకూలంగా ఉండటంతో.. ఆయనకే పదవి ఖాయం అంటున్నారు చాలామంది. చూడాలి మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది.