Posani Krishna Murali : త‌ప్పు తెలుసుకొని త‌ప్పుకున్న ఆలీ.. మ‌రి పోసాని ప‌రిస్థితి ఏంటంటే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Posani Krishna Murali : త‌ప్పు తెలుసుకొని త‌ప్పుకున్న ఆలీ.. మ‌రి పోసాని ప‌రిస్థితి ఏంటంటే..!

Posani Krishna Murali : ఏపీలో వైసీపీ దారుణ‌మైన ఓట‌మి చ‌విచూడ‌డంతో మెల్ల‌గా ఒక్కొక్క‌రు జారుకుంటున్నారు. చంద్రబాబు సీఎంగా, పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి.. తమ మార్క్ పాలనతో దూసుకుపోతుండ‌డంతో వైసీపీకి నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. ఇక ఆ నాడు పవన్‌ను, చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపించిన నోళ్లన్నీ.. ఇప్పుడు సైలెంట్ అవుతున్నారు. వైసీపీ ఓటమితో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన అలీ.. ఇక రాజకీయాలు వద్దు అంటూ వైసీపీకి రాజీనామా చేశారు. ఇక పోసాని, శ్యామ‌ల వైసీపీకి […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 July 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Posani Krishna Murali : త‌ప్పు తెలుసుకొని త‌ప్పుకున్న ఆలీ.. మ‌రి పోసాని ప‌రిస్థితి ఏంటంటే..!

Posani Krishna Murali : ఏపీలో వైసీపీ దారుణ‌మైన ఓట‌మి చ‌విచూడ‌డంతో మెల్ల‌గా ఒక్కొక్క‌రు జారుకుంటున్నారు. చంద్రబాబు సీఎంగా, పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి.. తమ మార్క్ పాలనతో దూసుకుపోతుండ‌డంతో వైసీపీకి నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. ఇక ఆ నాడు పవన్‌ను, చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపించిన నోళ్లన్నీ.. ఇప్పుడు సైలెంట్ అవుతున్నారు. వైసీపీ ఓటమితో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన అలీ.. ఇక రాజకీయాలు వద్దు అంటూ వైసీపీకి రాజీనామా చేశారు. ఇక పోసాని, శ్యామ‌ల వైసీపీకి స‌పోర్ట్ చేయ‌గా వారిని దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. వారు తమ ఇళ్ళకి తాళాలు వేసుకొని బతుకుతున్నారంటూ ఒక టాక్ వినిపిస్తుంది. ఇంటి లోపలే ఉండి. బయట తాళాలు వేసుకుంటున్నారు. కనీసం పాల వాళ్ళు వచ్చి పిలిచినా తలుపు తియ్యటం లేదు. అలీ అయితే ఏటో వెళ్లిపోయాడనే వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు నట్టి కుమార్ ఈ విషయాన్నీ వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్ లో మొన్నటికి దాకా అధికారంలో ఉన్న వైసీపీ కి వకాల్తా పుచ్చుకొని టిడిపి,జనసేన అధినేతలైన చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ ని నానా దుర్భాషలు ఆడారు. సభ్యసమాజం మొత్తం ఆ ముగ్గురు మాట్లాడిన మాటలకి తలదించుకుంది. ఇక ఇప్పుడు టీడీపీ, జనసేన అధికారంలోకి రావడంతో భయంతో తాళాల ఆట ఆడుకుంటూ కర్మ అనుభవిస్తున్నారు అని న‌ట్టి చెప్పుకొచ్చారు. అయితే పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక.. ఏకంగా రాజకీయాలు వదిలేశారు అలీ. సినిమాలు, షూటింగ్‌లే లోకం అంటున్నారు. ఇదంతా పవన్ ఫ్యాన్స్ ఎఫెక్టే అనే చర్చ జరుగుతోంది.

Posani Krishna Murali త‌ప్పు తెలుసుకొని త‌ప్పుకున్న ఆలీ మ‌రి పోసాని ప‌రిస్థితి ఏంటంటే

Posani Krishna Murali : త‌ప్పు తెలుసుకొని త‌ప్పుకున్న ఆలీ.. మ‌రి పోసాని ప‌రిస్థితి ఏంటంటే..!

ఆలీ సంగ‌తి అటుంచితే పోసాని పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. పవన్ విషయంలో పోసాని చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. జగన్‌కు వంత పాడడంతో పాటు.. పవన్‌ కేరక్టర్‌ డీగ్రేడ్ చేసేలా పోసాని మాట్లాడారు అని.. జనసైనికులు, పవర్‌స్టార్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. అలాంటి పోసాని పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.పిఠాపురంలో పవన్ ఓడిపోతారు అన్న శ్యామలకే.. జనసేన కార్యకర్తలు చుక్కలు చూపిస్తున్నారు. అలాంటిది పోసాని వదులుతారా.. నెక్ట్స్‌ వేసేది నిన్నే గురూ అంటూ వార్నింగ్‌లు పంపుతున్నారు. ఎలా ఉన్నా.. అలీ వైసీపీ ముద్ర నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి పోసాని ఏం చేస్తారు.. సినిమాలే ముఖ్యం అనుకొని బయటకు వస్తారా.. వైసీపీకి విధేయుడిలా ఉంటారా అనే విష‌యంపై ఇప్పుడు నెట్టింట చ‌ర్చ జ‌రుగుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది