Alia Bhatt : ఇంటిదైన అలియా భ‌ట్.. భ‌ర్త‌తో లిప్ లాక్ లాగించేసిందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: April 15, 2022, 11:00 am

Alia Bhatt : కొన్నేళ్లుగా అభిమానుల‌ని ఊరిస్తూ వ‌స్తున్న అలియా భ‌ట్- ర‌ణ్‌బీర్ క‌పూర్ జంట ఎట్ట‌కేల‌కు పెళ్లి పీట‌లు ఎక్కింది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. గురువారం(ఏప్రిల్‌14)న రణ్‌బీర్‌ కపూర్‌ ఇల్లు బాంద్రాలోని వాస్తులో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి ఫోటోలను ఆలియా భట్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఫోటోలు షేర్‌ చేసిన కాసేపటికే ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీరిద్దరు ఎంత క్యూట్‌గా ఉన్నారో..ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండండి అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో కొత్తజంటకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

ముఖ్యంగా ఈ జంట లిప్ లాక్ ఇచ్చుకుంటూ దిగిన ఫొటో ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.అలియా-ర‌ణ్‌బీర్ వివాహానికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైయ్యారు. వారి వివాహం ఈరోజు అంటే ఏప్రిల్ 14న రణబీర్ కపూర్ బాంద్రాలోని ఇల్లు వాస్తులో జరిగింది. వీరి వివాహానికి నీతూ కపూర్, రిద్ధిమా కపూర్ సాహ్ని, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేష్ భట్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్ తదితరులు హాజరయ్యారు. ఇంతకుముందు, రణబీర్ కపూర్, ఆలియా భట్‌ల పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరుగనుందని టాక్ నడిచినా..

alia bhatt gives lip lock to her husband

alia bhatt gives lip lock to her husband

Alia Bhatt : క్యూట్ క‌పుల్ బాగుంది..

కొన్ని కారణాల వల్ల కుటుంబ సభ్యులు పెళ్లిని ముంబైలో జరపాలని నిర్ణయించారట.. ఇక వీరిద్దరూ కలిసి నటిస్తున్న భారీ ప్యాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్రం విడుదల రెడీ అవుతోందిఅలియా భ‌ట్ రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో, గంగూబాయ్ క‌తియావాడి సినిమాతో ప‌ల‌క‌రించింది. ఈ సినిమాల విషసియానికి వస్తే.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మంచి విజయాన్ని అందుకుంది. ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రలో నటించింది. ఆ సినిమాతో పాటు అలియా భట్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమాతో నటించి అదరగొట్టారు.

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp