Home » Entertainment » Alia Bhatt Latest Pics In Viral
Entertainment

Alia Bhatt : అలియా భ‌ట్ అందాల ఆర‌బోత పీక్స్‌లో ఉందిగా.. కేక పెట్టిస్తున్న క్యూట్ లుక్స్

Authored By
Sam C
The Telugu News | Published on: March 18, 2022, 1:30 pm
Advertisement

Alia Bhatt : అందం, అభిన‌యంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ అలియా భ‌ట్‌. నాజూకు షోకుల‌తో చూప‌రుల‌ను ఇట్టే ఆక‌ట్టుకొనే రూపం అలియా భ‌ట్ సొంతం. ఈమె న‌ట‌న‌లోని చ‌రుపు అలియా భ‌ట్ ను న‌వ‌త‌రం నాయిక‌ల్లో ప్ర‌త్యేకంగా నిలుపుతాయి. గంగుబాయిగా జ‌నం గుండెల్లో చోటు సంపాదించిన అలియా, రాబోయే రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్.తో తెలుగువారిని ప‌ల‌క‌రించ‌బోతోంది. ఇప్ప‌టికే త‌న హిందీ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను పుల‌క‌రింప చేసిన అలియా పాన్ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్‌తో మ‌రింత‌గా అల‌రించ‌నుంద‌నే చెప్పాలి.

Advertisement

గంగూబాయి కతియావాడి తర్వాత, అలియా ఇప్పుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో SS రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 25 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా, రణబీర్ కపూర్‌తో కలిసి ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలోనూ నటిస్తోంది. ఇది మాత్రమే కాకుండా, అలియా భట్ స్పై థ్రిల్లర్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో గాల్ గాడోట్ మరియు జామీ డోర్నన్‌లతో కలిసి హలీవుడ్ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. అలియా భ‌ట్ సినిమాల‌పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉంటాయి.ఈ అమ్మ‌డు ఇటీవ‌ల తెగ ఫొటో షూట్స్ చేస్తుంది.

alia bhatt latest pics in Viral

Advertisement

Alia Bhatt : అలియా అందానికి ముగ్ధులు అవ్వాల్సిందే..

ఎక్కువ‌గా చీర‌క‌ట్టులోనే క‌నిపించి సంద‌డి చేసిన అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు పొట్టి దుస్తుల‌లో అందాలు ఆర‌బోస్తూ మెస్మ‌రైజ్ చేస్తుంది. అలియా భ‌ట్ క్యూట్ నెస్‌కి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. అమ్మ‌డి అందాల‌ని పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. అలియా భ‌ట్ క్యూట్ నెస్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది. త‌న తండ్రి మ‌హేశ్ భ‌ట్ ర‌చ‌న‌తో తెర‌కెక్కిన అక్ష‌య్ కుమార్ సంఘ‌ర్ష్ చిత్రంలో ఆరేళ్ళ ప్రాయంలోనే అలియా బాల‌న‌టిగా న‌టించింది. క‌ర‌ణ్ జోహార్ తెర‌కెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ చిత్రంతో అందాల‌భామ‌గా అల‌రించింది. తొలి చిత్రంలోనే న‌టిగా మంచి మార్కులు సంపాదించింది అలియా. ఆ త‌రువాత నుంచీ అవ‌కాశాలు ఆమె వెంట న‌డిచాయి .

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి