regina cassandra : రెజీనా కసాండ్ర చెప్పిన మాటలు వింటే ఇక నిర్మాతలందరూ క్యూకడతారు..!

Authored By vamana sai | The Telugu News | Updated on: January 24, 2021, 9:36 am

regina cassandra రెజీనా కసాండ్ర .. ఇండస్ట్రీ లో ఎనిమిదేళ్ళ అనుభవం ఉన్న అందాల సుందరి. మెగా హీరోలకి పర్‌ఫెక్ట్ జోడీ అన్న పేరు తెచ్చుకున్న రెజీనా కసాండ్ర కు ఇప్పటికీ చెప్పుకోదగ్గ అవకాశాలు లేవన్న సంగతి తెలిసిందే. నటనా నైపుణ్యం ఉన్నా, అందాల ఆరబోతకు వెనకడుగు వేయకపోయిన అమ్మడి స్టార్ తిరగలేదు. ఇండస్ట్రీ లో ఉన్న ఆల్మోస్ట్ యువ హీరోలతో జతకట్టి తెరపై తళుక్కుమన్న రెజీనా కు స్టార్ హీరోయిన్ అయ్యే మ్యాటర్ ఉన్నా అవకాశాలు మాత్రం అంతంతమాత్రమే అని చెప్పాలి. అందులోనూ ఈ మధ్య కాలంలో సినీ అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు.

all producers will be in queue if they listens rejina kasandra words

all producers will be in queue if they listens rejina kasandra words

యంగ్ హీరో అడవి శేష్ నటించిన ఎవరు తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. దీనితో రెజీనా ఫేడ్ అవుట్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. ఇక మళ్లీ తెరపై కనిపించదు అని అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ కంబ్యాక్ ఇస్తోంది రేజీనా. నేనేనా? అనే మూవీ తో తానేంటో చూపించేందుకు రెడీ అవుతోంది. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ తో మంచి క్రేజ్ ను పొందాలని ప్లాన్ చేస్తోంది. అయితే కెరీర్ ప్రారంభంలో తాను చేసిన పొరపాట్ల గురించి ఇటీవల బయట పెట్టింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చానని.. రెజీనా కసాండ్ర ప్రారంభంలో ఇండస్ట్రీ పై సరైన క్లారిటీ లేదని తెలిపింది.

రెజీనా కెరీర్ లో ది బెస్ట్ గా చెప్పుకునే అవకాశం అంటే మెగాస్టార్ ఆచార్య సినిమా ..!

ఇండస్ట్రీ లో ఎన్నో రూల్స్ ఉంటాయని అందరూ అవే ఫాలో అవుతారని చెప్పింది. అయితే తాను మాత్రం అందరికంటే భిన్నంగా ఉంటాని అని తెలిపింది. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ఏ విషయమైనా సహించలేనని అంటోంది. కథ తనకు నచ్చితే ఓకే చేస్తానని.. మంచి కథల కోసం వేయిట్ చేస్తున్నట్టు తెలిపింది. ఒకరకంగా మేకర్స్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. రెజీనా చెప్పిన ఈ మాటలు కనుక నిర్మాతలందరూ వింటే రెజీనా వెనుకే క్యూ  కడతారు. అసలే రెజీనా అవకాశాల కోసం ఆతృతగా ఉంది. నిర్మాతలకి ఇప్పుడు కావాల్సింది కాస్త ఫేం ఉండి రెమ్యూనరేషన్ డిమాండ్ చేయని హీరోయిన్సే.ఇక రెజీనా కెరీర్ లో ది బెస్ట్ గా చెప్పుకునే అవకాశం అంటే మెగాస్టార్ ఆచార్య సినిమా. ఈ సినిమాలో రెజీనా మెగాస్టార్ చిరంజీవి తో కలిసి స్పెషల్ సాంగ్ చేసే అవకాశం దక్కించుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిన మెగాస్టార్ తో పాటు చిత్ర యూనిట్ ని పొగడ్తలు కురిపించుకుంది.

vamana sai

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp