Shiva jyothi : అన్ని లెక్కలు బయటపెట్టేసింది.. శివజ్యోతి రచ్చ మామూలుగా లేదు!!
Shiva jyothi : బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ ఇప్పుడు ఒకే దారిలో వెళ్తున్నారు. బిగ్ బాస్ షో వల్ల ఏకంగా స్టార్లు అయి వెండితెర మీద రఫ్పాడించేంత సీన్ లేని కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో బిజీ అయ్యేందుకు, అదే సమయంలో కాస్త రాబడి ఉండే దారి పట్టుకున్నారు. అదే యూట్యూబ్ చానెల్ బిజినెస్. బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్‌ను యూట్యూబ్ చానెల్‌ను పెట్టుకుని ఫేమస్ చేసుకునేందుకు వాడుకుంటున్నారు.

Shiva jyothi Youtube statistics
అలా చాలా మంది యూట్యూబ్ చానెల్లు పెట్టుకున్నారు. అషూ, హిమజ, శివజ్యోతి, రోహిణి, అరియానా, అవినాష్, లాస్య వంటి వారంతా ఇప్పుడు యూట్యూబ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. వెరైటీ వెరైటీ వీడియోలను ప్లాన్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. స్పెషల్ టూర్లు, సర్ ప్రైజింగ్ వీడియోలు చూస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. అలా శివజ్యోతి కూడా తన యూట్యూబ్ చానెల్‌ను బాగానే రన్ చేస్తోంది.

Shiva jyothi Youtube statistics
అయితే తాజాగా శివజ్యోతి ఓ ఫీట్‌ను సాధించింది. 175 రోజుల్లోనే మూడు లక్షల సబ్ స్క్రైబర్స్ వచ్చారట. అంతే కాకుండా తనయూట్యూబ్ లెక్కలన్నీ కూడా బయటపెట్టేసింది. మొత్తంగా ఇప్పటి వరకు 35 వీడియోలు, 2 ప్రోమోలు, 8 వీడియోలకు మిలియన్ వ్యూస్‌కు పైగా సాధించాయి. ఓ వీడియోకు అత్యధికంగా 27 లక్షల వ్యూస్ వచ్చాయి. 13 వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇదంతా మీ ప్రేమ వల్లే సాధ్యమైంది.. ఎప్పుడూ ఇలానే సపోర్ట్ చేయండని శివజ్యోతి కోరింది.