Allu Aayan : తాత బౌలింగ్‌లో అల్లు అయాన్ ధనాధన్ బ్యాటింగ్.. చుక్కలు కనిపించి ఉంటాయిగా.. వీడియో !
Allu Aayan : సెలబ్రిటీలకి సంబంధించిన ఏ విడియో బయటకు వచ్చిన అది కొద్ది నిమిషాలలో వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు, వారి పిల్లలు,బంధువులకి సంబంధించిన వీడియోలు క్షణాలలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అల్లుఅర్జున్ తనయుడు అల్లు అయాన్ వీడియో వైరల్ గా మారింది. అల్లు స్నేహ రెడ్డి రెగ్యులర్ గా అల్లు అయాన్, అల్లు అర్హ ఫోటోలు, వాళ్ళు చేసే అల్లరి వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా గీత్ ఆర్ట్స్ ఓ […]
ప్రధానాంశాలు:
Allu Aayan : తాత బౌలింగ్‌లో అల్లు అయాన్ ధనాధన్ బ్యాటింగ్.. చుక్కలు కనిపించి ఉంటాయిగా.. వీడియో !
Allu Aayan : సెలబ్రిటీలకి సంబంధించిన ఏ విడియో బయటకు వచ్చిన అది కొద్ది నిమిషాలలో వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు, వారి పిల్లలు,బంధువులకి సంబంధించిన వీడియోలు క్షణాలలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అల్లుఅర్జున్ తనయుడు అల్లు అయాన్ వీడియో వైరల్ గా మారింది. అల్లు స్నేహ రెడ్డి రెగ్యులర్ గా అల్లు అయాన్, అల్లు అర్హ ఫోటోలు, వాళ్ళు చేసే అల్లరి వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా గీత్ ఆర్ట్స్ ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది.బన్నీ కొడుకుగా కాకుండా చిన్నతనంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయాన్. అయితే అల్లు అయాన్‌కు సంబంధించిన అల్లరిచేసే వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
Allu Aayan అయానా, మజాకానా..
తన చెల్లి అల్లు అర్హ కంటే అయాన్ ఎక్కువ అల్లరి చేయడం. సరదాగ ఆటపట్టించడం లాంటి వీడియోలు కనిపిస్తుంటాయి.తాజాగా అల్లు అయాన్ తన తాత అల్లు అరవింద్‌తో కలిసి క్రికెట్ ఆడాడు. మనవడు బ్యాటింగ్ చేస్తుండగా.. అల్లు అరవింద్ అయాన్‌కు బౌలింగ్ వేశాడు. ఇక అల్లు అరవింద్ వేసిన ప్రతి బాల్‌ను షాట్ ఆడాడు అయాన్. కాగా మనవడితో క్రికెట్ ఆడుతున్న అల్లు అరవింద్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాత మనవడు కలిసి సరదాగా క్రికెట్ ఆడుకుంటున్న ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు మురిసిపోతున్నారు.
దీంతో బన్నీ ఫ్యాన్స్ అయాన్ బ్యాటింగ్ అదరగొడుతున్నాడని, తాతమనవళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారని, ఎంత పెద్ద నిర్మాత అయినా మనవడితో ఇలా సరదాగా ఆడటం విశేషం అని కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా అల్లు అరవింద్ – అల్లు అయాన్ క్రికెట్ ఆడుతున్న వీడియో చూసేయండి.. ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అరవింద్ ప్రస్తుతం నాగ చైతన్యతో ‘తండేల్’ అనే మూవీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా.. కార్తికేయ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.
#AlluAravind and #AlluAayan having fun playing cricket 🏏 pic.twitter.com/yIAoqwWHCD
— Telugu Insider (@telugu_insider) August 12, 2024