Allu Aravind : ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే… అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు
ప్రధానాంశాలు:
Allu Aravind : ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే... అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు
Allu Aravind : సైమా అవార్డుల ప్రెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తెలుగు సినిమాలకు వచ్చిన 7 జాతీయ అవార్డులు గురించి మాట్లాడుతూ, ఇండస్ట్రీ ఎలా స్పందించలేకపోతుందో వివరించారు.”తెలుగు సినిమాలకు 7 నేషనల్ అవార్డులు వచ్చినప్పటికీ, ఇండస్ట్రీ అంతా కలిసి స్పందించలేదు. ఇంకా ఎవరు సత్కరించకముందే, సైమా ఈ గౌరవాన్ని ఇచ్చింది.”

Allu Aravind : ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే… అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు
Allu Aravind : సంచలన కామెంట్స్..
“మన సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు తాము చెందిన వర్గానికే పరిమితమవుతున్నారు. ఎవరి కుంపటి వారిదే. అందుకే కలిసొచ్చే అభివృద్ధి చోటు చేసుకోవడం లేదు.ష “ఇలాంటి విభజనల వల్ల మంచి పనులు చేయలేకపోతున్నాం. ఇండస్ట్రీగా మేమంతా కలిసిరాలేం అని అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదేనన్నారని అన్నారు. జాతీయ అవార్డులకు ఎంపికైన వారిని సత్కరించకపోవడంపై అయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినిమాకు ఇన్ని అవార్డులు వచ్చినా మన పరిశ్రమ స్పందించలేదు. జాతీయ అవార్డులను ఒక పండుగగా నిర్వహించుకోవాలి. ఇక్కడ అలా జరగడం లేదు. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే. అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం’ అని అన్నారు. ఇండస్ట్రీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంత ఎక్కువైందో అల్లు అరవింద్ మాటలతో స్పష్టమవుతోంది. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చకు దారి తీస్తున్నాయి.