Allu Family | అల్లు వారింట పెళ్లి సందడి.. శిరీష్ పెళ్లి చేసుకోబోయే యువతి ఎవరంటే..!
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కొత్త జంట, ఏబీసీడీ, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాల్లో నటించినా మంచి పేరు తెచ్చుకోలేకపోయాడు. చివరిగా ‘టెడ్డీ’ చిత్రంతో వచ్చిన శిరీష్ మరోసారి నిరాశపరిచాడు. యాక్టింగ్ పరంగా మెరుగైనా కథల ఎంపికలో పొరపాట్ల వల్లే శిరీష్ దెబ్బతింటున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

#image_title
శుభకార్యం..
అల్లు కుటుంబంలో ఇటీవలే తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అల్లు రామలింగయ్య సతీమణి, అరవింద్ తల్లి అయిన కనకరత్నమ్మ కొద్దిరోజుల క్రితమే కన్నుమూశారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం అల్లు వారింటి పెళ్లి భాజాలు మోగనున్నాయి. అల్లు శిరీష్‌ని ఓ ఇంటివాడిని చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్టు తెలుస్తుంది.
హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెతో శిరీష్‌కి పెళ్లి నిశ్చయం చేసినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల మధ్య ఇప్పటికే మాటలు పూర్తయి పెళ్లికి నిర్ణయం తీసుకున్నారట. పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలోనే అల్లు కనకరత్నమ్మ కన్నుమూయడంతో శుభకార్యం వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ జంటకి ఎంగేజ్‌మెంట్ నిర్వహించి పెళ్లి కూడా వీలైనంత త్వరగా చేయాలని ఇరు కుటుంబాలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.