Allu Aravind : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాంట్రవర్సీకి కేర్ అఫ్ అడ్రస్ గా ఆయన వ్యవహరించే తీరు ఉంటుంది. ఇదిలా ఉంటే శ్రీరెడ్డి ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఒక బూతు పదం మాట్లాడుతూ మధ్య వేలు చూపించడం.. తెలిసిందే. ఆ టైంలో శ్రీరెడ్డి ఇష్యూ చాలా వివాదాస్పదంగా మారింది. ఇటువంటి క్రమంలో అప్పట్లో ఈ గొడవకు సంబంధించి అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అన్న తరహాలో రామ్ గోపాల్ వర్మకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

ఆ వీడియో ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాంగోపాల్ వర్మ నీకు సంబంధించిన ఆడవాళ్లను లేదా నీ తల్లిని… అక్క ఇంకా కూతురిని ఇష్టానుసారంగా తిట్టిస్తే నువ్వు తట్టుకోగలవా. మాకు అటువంటి సంస్కారం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నాగార్జున ద్వారా సినిమా ఛాన్స్ అందుకుని నువ్వు చాలా పెద్ద స్థాయికి వెళ్లావు. టాలీవుడ్ నీకు తల్లి లాంటిది. అటువంటిది… ఈ తల్లి పాలు తాగి.. ఇవ్వాళ రొమ్ము కొట్టడానికి కూడా.. వెనుకాడటం లేదు.
ఎందుకు చలనచిత్ర పరిశ్రమనీ ఇంత చిన్నదిగా చేయాలని… అనుకుంటున్నావు. ఇటువంటి వ్యక్తులను తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఇండస్ట్రీలో ఉంచుతారా..? లేదా..? అన్నదానిపై చర్చిస్తా. ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్లు ఇండస్ట్రీలో ఎందుకు ఉండాలి..? ఎలా ఉండాలి..? అన్న దానిపై.. ఇండస్ట్రీకే వదిలేస్తాను. పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించడానికి ఆర్జీవి చేసిన కుట్రలో వెనక ఉన్నది ఎవరు..? అన్నదానిపై ఆయనే నోరు విప్పాలి అంటూ అప్పట్లో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.