Allu Arjun : విలన్ గెటప్‌లో అల్లు అర్జున్.. నెవర్ బిఫోర్ అవతార్ పక్కా!
ప్రధానాంశాలు:
Allu Arjun : విలన్ గెటప్‌లో అల్లు అర్జున్.. నెవర్ బిఫోర్ అవతార్ పక్కా!
allu arjun plays dual role in atlee film
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. సైన్స్‌ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. తాత్కాలికంగా ‘AA22 x A6’గా పేరు పెట్టిన ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ సెలెబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో శారీరకంగా పూర్తిగా మారబోతున్నాడు. ఇందులో రగ్గడ్ అండ్ పవర్ ఫుల్ గా కనిపిస్తూ ప్రేక్షకులని అలరిస్తారట.

Allu Arjun : విలన్ గెటప్‌లో అల్లు అర్జున్.. నెవర్ బిఫోర్ అవతార్ పక్కా!
Allu Arjun ఇంట్రెస్టింగ్ న్యూస్..
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీది డ్యూయల్ రోల్ అని తెలుస్తోంది. ఓ పాత్రలో పూర్తిగా నెగిటీవ్ షేడ్స్ ఉంటాయట. దాదాపుగా విలన్‌కు సమానమైన పాత్ర అదని తెలుస్తోంది. అంటే.. ఈ సినిమాలో హీరో, విలన్ రెండూ బన్నీనే అన్నమాట. ఈ తరహా పాత్ర చేయడం స్టార్ హీరోలకు ఓ రకంగా ఛాలెంజ్ అనుకోవాలి.
పుష్ప లో కూడా బన్నీ పాత్రలో కొంత నెగిటీవ్ షేడ్ కనిపిస్తుంది. కాబట్టి.. బన్నీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మరోవైపు త్రివిక్రమ్ సైతం తన కథపై భారీగా కసరత్తులు చేస్తున్నారు. అట్లీ సృష్టిస్తున్న ప్రపంచానికి అనుగుణంగా ఉండే కొత్త లుక్‌ను ప్రయత్నిస్తున్నారు. ఇది అల్లు అర్జున్‌కు పూర్తిగా భిన్నమైన అవతార్ అని తెలుస్తోంది. కేవలం శరీర దారుఢ్యంతో కాకుండా, తన స్క్రీన్ ప్రెజెన్స్‌ను పెంచేలా అర్జున్ పనిచేస్తున్నాడని సమాచారం.