ఇది మరీ ఓ రేంజ్ భజన.. ఆహాను వాడేసుకున్న అల్లు అర్జున్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఇది మరీ ఓ రేంజ్ భజన.. ఆహాను వాడేసుకున్న అల్లు అర్జున్

 Authored By bkalyan | The Telugu News | Updated on :2 January 2021,11:27 am

ఆహా యాప్‌తో అల్లు అరవింద్.. తెలుగు ఓటీటీ ప్రపంచానికి పితామహుడు అయ్యారు అంటూ అల్లు అర్జున్ పెద్ద పెద్ద పదాలను వాడేశాడు. ఇలా అల్లు బ్రాండ్‌ను ఇండస్ట్రీలో బలంగా వేయాలని బన్నీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నట్టున్నాడు. అందుకే అదును చూసి సరైన సమయం రాగానే అల్లు బ్రాండ్‌ను పైకి ఎత్తాడు. ఇన్నాళ్లు ఎక్కడా కూడా అల్లు బ్రాండ్‌ గురించి మాట్లాడని బన్నీ అల వైకుంఠపురములో సక్సెస్ తరువాత పైకి లేపాడు.

Allu Arjun about Ally Brand samantha Sam jam Show In Aha

Allu Arjun about Ally Brand samantha Sam jam Show In Aha

అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ అని వేసుకోవడం అది కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ ఖాతాలోనే వేసుకోవడం తనంతా మొనగాడు లేడన్నట్టు స్టేజ్ మీదే తాత, నాన్న అంటూ అల్లు బ్రాండ్ గురించి మాట్లాడాడు. ఇన్నాళ్లు మెగా జపం చేసిన బన్నీ ప్రస్తుతం పూర్తిగా అల్లు జపమే చేస్తున్నాడు. ఇక ఈ మధ్య ఆహా యాప్ ద్వారా అల్లు బ్రాండ్‌ను లేపే ప్రయత్నం చేశాడు. తాజాగా ఆహా యాప్‌లో బన్నీ ఎపిసోడ్ ప్రసారమైంది. ఇందులో కూడా పూర్తిగా అల్లు బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆ ఎపిసోడ్ చేసినట్టుంది.

అల్లు అర్జున్, స్టైలీష్ స్టార్, అల వైకుంఠపురములో రికార్డులు, బుట్టబొమ్మ, అల్లు స్టూడియో, మోస్ట్ సర్చ్డ్ టాలీవుడ్ యాక్టర్ అంటూ ఇలా తన రికార్డుల గురించే ప్రస్తావించేలా ఆహా టీం స్క్రిప్ట్ రాసుకుంది. మొత్తంగా అల్లు భజన కోసం బన్నీ ఎపిసోడ్‌ను డిజైన్ చేసినట్టుగా కనిపించారు. వారిది వారే డప్పు కొట్టుకుంటూ అల్లు వారి బ్రాండ్‌ను ఇండస్ట్రీలో గుర్తించేలా చేసుకుంటున్నారు. మొత్తంగా బన్నీ మాత్రం మెగా హీరో అనే ట్యాగ్ వదిలించుకున్నాడని తెలుస్తోంది. అల్లు హీరోగానే తనను పిలవాలని మున్ముందు హుకుం జారీ చేస్తాడేమో ఇక.

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది