Allu Arjun : అఖండ ట్రైలర్ చూసి షాకైన బన్నీ.. వెంటనే ఏం చేశాడంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : అఖండ ట్రైలర్ చూసి షాకైన బన్నీ.. వెంటనే ఏం చేశాడంటే?

 Authored By mallesh | The Telugu News | Updated on :28 November 2021,1:10 pm

Allu Arjun : నందమూరి నటసింహం బాలకృష్ణ ‘అఖండ’ మూవీతో తన అభిమానులకు మాస్ మసాలా అందించేందుకు సిద్దమయ్యారు. శనివారం ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరిగింది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా.. బాలయ్యకు జోడిగా ‘కంచె’ ఫేమ్ ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తోంది. ఇక ప్రతినాయకుడి పాత్రలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో మరో ఫ్యామిలీ హీరో జగపతి బాబు కూడా కీ రోల్ పోషించినట్టు తెలుస్తోంది.అయితే, చాలా గ్యాప్ తర్వాత బాలకృష్ణ మూవీ రిలీజ్ అవుతుండటంతో నందమూరి ఫ్యాన్స్ పిచ్చి ఆనందంలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన అఖండ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీలో ఉన్నారు. ఇక అఖండ మూవీ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకం రావడం ఖాయంగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్బంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా కుండబద్దలు గొట్టారు.

Allu arjun About On Akhanda Movie Pre Release Event

Allu arjun About On Akhanda Movie Pre Release Event

Allu Arjun : అఖండతో ఫ్యాన్స్కు పూనకాలే..

తొలిసారి బాలకృష్ణ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన బన్నీ బాలయ్య బాబు గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. నటనలో ఎందరికో స్పూర్ఫి అని చెప్పారు. అఖండ సెకండ్ ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత బన్నీ మాటలకు నందమూరి ఫ్యాన్స్ తెగ ఏంజాయ్ చేశారట.. బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ చాలా ఎక్సట్రాడినరీగా ఉంటుందని కితాబిచ్చేశారట.. అలా చేయడం మా వల్ల కాదన్నడట. అఖండ ట్రైలర్ చూసి తనకు గూస్ బమ్స్ వచ్చాయని వెంటనే దర్శకుడు బోయపాటి శ్రీనుకు కాల్ చేసి పూనకం తెప్పించారుగా అని అన్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో ఈవెంట్ మొత్తం ఫ్యాన్స్ అరుపులతో మోగ మోగిపోయింది.

YouTube video

Tags :

    mallesh

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది