Allu Arjun : రాకుమారిలా వెనక కూర్చున్న అర్హ.. కూతురి కోసం డ్రైవర్‌గా మారిన అల్లు అర్జున్
Allu Arjun : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనే సామెత గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీకి ఐకాన్ స్టార్ అయినా కూడా కూతురికి డ్రైవరే అనేది ఇప్పుడు కొత్త నానుడి అవుతుందేమో. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్లలు అర్హ, అయాన్‌లతో ఎంత సరదాగా ఉంటూ అల్లరి చేస్తాడో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా అర్హతో కలిసి బన్నీ చేసే అల్లరి చేష్టలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. పెళ్లికి సంబంధించిన క్యూట్ వీడియో, బన్నీతో అర్హ పెట్టే చర్చ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
ఇక ఈ మధ్యే బన్నీ ఫ్యామిలీ మాల్దీవుల నుంచి తిరిగి వచ్చింది. దాదాపు వారం రోజులు మాల్దీవుల్లో ఎంజాయ్ చేశారు. బన్నీ, స్నేహారెడ్డి, అర్హ, అయాన్‌లు మాల్దీవుల్లో హంగామా చేశారు. అక్కడ ఎలా ఎంజాయ్ చేశారో చూపిస్తూ స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు వీడియోలను షేర్ చేసింది. ఫోటోలతో అప్డేట్లను ఇచ్చింది. అయితే తాజాగా అల్లు స్నేహారెడ్డి ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో బన్నీ తనకారు వేసుకుని ఫ్యామిలీని తీసుకుని బయటకు వచ్చాడు.
Allu Arjun : కారులో బన్నీ, అర్హ
బన్నీ అలా తన కారును డ్రైవ్ చేసుకుంటూ జనావాసంలోకి వచ్చాడు. వెనకాల అర్హ అలా రాకుమారి కూర్చుని తన పనిలో తాను ఉంది. ఇక స్నేహారెడ్డి ముందు సీట్లో కూర్చుని వీడియో తీసింది. ఇక డ్రైవర్‌లా మారి అల్లు అర్జున్ తన ఫ్యామిలీని బయటకు తిప్పుకొచ్చాడు. మొత్తానికి బన్నీకి సంబంధించిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. క్యూట్ డాటర్, స్వీట్ ఫాదర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్నేహా రెడ్డి షేర్ చేసిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
When @alluarjun & his family vibed to #GuccheGulabi on a drive ????#AlluArjun #Bunny #Tollywood #TollywoodActor #AlluArha #AlluSnehaReddy pic.twitter.com/1PRStRPWcb
— Hyderabad Times (@HydTimes) October 22, 2021