Allu Arjun Vijay Devarakonda : ఇంకా ఆ నెలలు ఈ హీరోలను మాసిన గడ్డం.. చింపిరి జుట్టుతో చూడాల్సిందే ?

Authored By Himanshi | The Telugu News | Published on: January 1, 2022, 2:00 pm

Allu Arjun Vijay Devarakonda : టాలీవుడ్‌ హీరోల్లో అత్యధిక యూత్‌ ఫాలోయింగ్‌ హీరోల జాబితాలో అల్లు అర్జున్‌ మరియు విజయ్ దేవరకొండ లు ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరు కూడా యూత్‌ లో విపరీతమైన క్రేజ్‌ ను కలిగి ఉన్న హీరోలు. ఒకరికి స్టైలిష్ స్టార్‌ మరియు ఐకానిక్ స్టార్‌ అనే పేర్లు ఉండగా మరొకరికి రౌడీ స్టార్‌ అంటూ అభిమానులు బిరుదులు ఇచ్చారు. అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ వీరికి ఉంది. అంత ఫాలోయింగ్‌ కు కారణం వారి లుక్ అనడంలో సందేహం లేదు. ఇద్దరు కూడా మోస్ట్‌ స్టైలిష్ హ్యాండ్సమ్స్ గా అమ్మాయిల కలల రాకుమారులుగా నిలిచారు. కాని ఇప్పుడు వారిని అమ్మాయిలు చూసేందుకు కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

గత రెండేళ్లుగా కూడా వీరిద్దరు అంతంత జుట్టు పెంచుకుని.. మాసిన గడ్డంతో పుష్ప అయితే మాసిన డ్రస్ లతో కనిపిస్తున్నాడు. వీరిద్దరు కూడా వారి వారి సినిమాల కోసం రెండేళ్లుగా జుట్టు పెంచుతున్నారు. గడ్డాలు కూడా పెంచి దేవదాసుల మాదిరిగా ఉన్నారు. వీరి లుక్ విషయంలో ఎన్నో విమర్శలు వస్తున్నాయి. అయినా కూడా పట్టించుకోకుండా సినిమాల కోసం అన్నట్లుగా కంటిన్యూ అవుతున్నారు. పుష్ప సినిమా విడుదల అయ్యింది కదా అల్లు అర్జున్ నార్మల్‌ లుక్ కు వస్తాడు అనుకుంటే పుష్ప 2 ను ఫిబ్రవరిలో మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. దాంతో ఇక కట్‌ చేయించే అవకాశం లేదు. కట్‌ చేయిస్తే అంత త్వరగా అంత జట్టు పెరగడం కష్టం. అందుకే పుష్ప 2 కోసం మరో ఆరు ఏడు మాసాల వరకు అల్లు అర్జున్ ను ఆ చింపిరి జుట్టు మాసిన గడ్డంతో చూడాల్సిందే.

Allu Arjun and Vijay Devarakonda hair styles trolls

Allu Arjun and Vijay Devarakonda hair styles trolls

Allu Arjun Vijay Devarakonda : ఇంకా  మాసిన గడ్డం.. చింపిరి జుట్టుతో చూడాల్సిందే

ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే అతడు లైగర్ సినిమా కోసం జుట్టు పెంచుతున్నాడు. బయటకు వచ్చిన సమయంలో రౌడీ స్టార్‌ పిలక వేసుకుని మరీ వస్తున్నాడు. లైగర్ లో ఆయన పాత్ర జుట్టు ఉంటుంది. కనుక రెండేళ్లకు పైగానే జుట్టు పెంచుతున్నాడు. పుష్ప మరియు లైగర్ లు 2019 లోనే షురూ అయినా కరోనా వల్ల ఆగుతూ వచ్చాయి. పుష్ప పూర్తి అయ్యి విడుదల అయినా రెండవ పార్ట్‌ షూట్‌ ఉంది.. ఇక విజయ్ దేవరకొండ లైగర్ షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు కావచ్చు అందుకే విజయ్ దేవరకొండ జుట్టు కట్‌ చేయించడం లేదు. ఈ ఇద్దరిని మునుపటి లుక్ లో ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ కొందరు అభిమానులు వెయిట్‌ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం ఇలా కూడా బాగానే ఉన్నారంటూ తమ అభిమాన హీరోలను వెనకేసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మీకు వీరి లుక్ ఇలా బాగుందా.. ఇంతకు ముందు లుక్‌ లో చూడాలని ఉందా చెప్పండి.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp