Allu Arjun : పుష్ప 2 హిట్ ఏమో కానీ అల్లు అర్జున్ ని పూర్తిగా కార్నర్ చేసేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో రేవతి అనే మహిళ మృతి చెందడానికి కారణం అల్లు అర్జునే అంటూ పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు పర్మిషన్ లేకుండా థియేటర్ కి వచ్చినందుకు, థియేటర్ లో సినిమా చూస్తున్న టైం లో మహిళ మృతి చెందింది అని తెలిసినా వెళ్లకపోవడం లాంటి తప్పులు అల్లు అర్జున్ సైడ్ నుంచి ఉన్నాయి. వీటిని ఎంత కవర్ చేయాలని చూస్తున్నా కూడా అది కుదరట్లేదు. మళ్లీ అసెంబ్లీలో రేవంత్ మాట్లాడిన తీరుకి ప్రతిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చిక్కుల్లో పడ్డాడు అల్లు అర్జున్. అందుకే మరోసారి అతన్ని విచారణకు పిలిచి పోలీసులు దాదాపు మూడున్నర గంటల పాటు విచారణ నిర్వహించారు.
ఐతే ఈ ఇష్యూపై అల్లు అర్జున్ ని నెటిజన్లు కూడా ఏకి పారేస్తున్నారు. ఒక్క రాత్రి జైలులో ఉండొచ్చిన అల్లు అర్జున్ తెల్లరే ఇంట్లో ఐకాన్ స్టార్ అనే టీ షర్ట్ తో తానేదో గొప్ప పని చేసి వచ్చాడన్నట్టు బిల్డప్ ఇస్తూ తిరిగాడు. తనకి సపోర్ట్ గా నిలబడుతూ వచ్చిన పరిశ్రమ వ్యక్తులను పలకరిస్తూ చాలా హ్యాపీగా కనిపించాడు. మొన్న ప్రెస్ మీట్ లో కూడా అల్లు అర్జున్ ఫేస్ లో బాధ కనిపించట్లేదని నెటిజన్లు అంటున్నారు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, ఎన్ టీ ఆర్ లాంటి స్టార్స్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా వాళ్లెప్పుడు వారి ఫ్యాన్స్ ని ఇలా ఇబ్బంది పెట్టలేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఈ అతి తగ్గించుకుంటేనే మంచిదని లేకపోతే ఇలాంటివి రిపీట్ అవుతాయని అంటున్నారు. రేవతి కేసు విషయంలో మొదట అల్లు అర్జున్ మీద సింపతీ ఏర్పడినా థియేటర్ బయట రేవతి మృతి చెందిన వార్త తెలిసినా తాను థియేటర్ లో సినిమా పూర్తయ్యే దాకా ఉంటానని అల్లు అర్జున్ చెప్పడం మాత్రం చాలా తప్పు. అది నిజమని పోలీసులు ప్రూవ్ చేస్తే మాత్రం ఐకాన్ స్టార్ రిస్క్ లో పడినట్టే అని చెప్పొచ్చు.
Allu Arjun : గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పుష్ప2లో…
Mohan Babu : తన ఫ్యామిలీతో జరుగుతున్న గొడవల్లో భాగంగా రిపోర్టర్ చెవికి గాయాన్ని చేశారు హీరో మంచు మోహన్…
Jr NTR : ఎన్ టీ ఆర్ ఫ్యాన్ కౌశిక్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ టైం లో…
Health Benefits : 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీలో ఆ స్టామినా మెయింటెనెన్స్ చేయడానికి కొన్ని ఆహారాలు…
Sai Pallavi Nithiin : ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు వేణు. ఆ సినిమాకు అవార్డులతో…
Good News : కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలు తీసుకొస్తూ ప్రజలని సంతోష పరుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
Nara Bhuvaneshwari : మరి కొద్ది రోజులలో 2024కి గుడ్ బై చెప్పబోతున్నాం.ఈ క్రమంలో ఈ ఏడాది జరిగిన సంగతుల…
Game Changer Movie : గ్లోబల్ స్టార్ రాం చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా గేమ్…
This website uses cookies.