Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 22 November 2024, 1:00 pm
  •  Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule  ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. సుకుమార్ ఓ పక్క సినిమాను డిసెంబర్ 5న తీసుకొచ్చేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. బయట అల్లు అర్జున్ మాత్రం సినిమా క్రేజ్ పెంచేందుకు నేషనల్ వైడ్ గా ప్రమోట్ చేస్తున్నారు. మొన్న పాట్నాలో జరిగిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో నెక్స్ట్ ఈవెంట్ కి ఫుల్ జోష్ మీద రెడీ అవుతున్నారు పుష్ప టీం. ఇక నెక్స్ట్ పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ ను చెన్నైలో ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 24న ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. చెన్నైలో లియో ముత్తు స్టేడియం లో ఇది జరగనుంది. పాట్నాలో లానే ఇక్కడ కూడా భారీ ఈవెంట్ జరిగేలా చూస్తున్నారు. తమిళనాడులో ఉన్న అల్లు ఫ్యాన్స్ అంతా ఆ వేడుకకు వచ్చేలా చూస్తున్నారు.

Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Allu Arjun నవంబర్ 27న కొచ్చి..

ఒక మరోపక్క పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా నవంబర్ 27న కొచ్చి వెళ్తున్నట్టు ఉన్నారు. కేరళలో అసలే అల్లు అర్జున్ కి సూపర్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ స్టార్ హీరోలకు ఈక్వల్ రేంజ్ అతనిది. అందుకే కేరళలో కొచ్చిలో పుష్ప 2 ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారట.

ఐతే పుష్ప 2 ఈవెంట్స్ అన్నీ కూడా అల్లు అర్జున్ ప్లానింగ్ తోనే జరుగుతున్నట్టు తెలుస్తుంది. తన టీం తో డిస్కస్ చేసి అల్లు అర్జున్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నారట. పాట్నాలో పుష్ప 2 ఈవెంట్ సూపర్ హిట్ కాగా చెన్నై, కొచ్చిలో కూడా వేడుకలతో సినిమాపై మంచి బజ్ ఏర్పడేలా చేస్తున్నారు మేకర్స్. ఈ దూకుడు చూస్తుంటే మాత్రం పుష్ప 2 కి నెక్స్ట్ లెవెల్ లో ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. పుష్ప 2లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది. Allu Arjun Behind that PAN India Promotions for Pushpa 2 The Rule , Allu Arjun, Pushpa 2 The Rule , Sukumar, PAN India, Rashmika Mandanna

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి