Pushpa 2 The Rule : ఆ సీన్‌తో అందరిలో సస్పెన్స్.. ఆ శవం ఎవరిది అంటూ జోరుగా చర్చ..!
Pushpa 2 The Rule : పుష్ప.. పుష్పరాజ్.. ఇప్పుడు ఎక్కడ చూసిన అదే వైబ్రేషన్స్. రీసెంట్‌గా రిలీజైన పుష్ప-2 ట్రైలర్ సినిమాపై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. అసలు.. ఇప్పటకీ బన్నీ ఫ్యాన్స్ ఇంకా ఆ ట్రాన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతీ సినిమా లవర్ ఇప్పటికే ట్రైలర్‌ను రిపీటెడ్ మోడ్‌లో చూస్తున్నారు. భారీ ఎత్తున ట్రైలర్ విడుదల చేయగా, గాంధీ మైదానం మొత్తం పుష్పరాజ్ అభిమానులతో నిండిపోయింది. దాదాపు 2 […]
ప్రధానాంశాలు:
Pushpa 2 The Rule : ఆ సీన్‌తో అందరిలో సస్పెన్స్.. ఆ శవం ఎవరిది అంటూ జోరుగా చర్చ..!
Pushpa 2 The Rule : పుష్ప.. పుష్పరాజ్.. ఇప్పుడు ఎక్కడ చూసిన అదే వైబ్రేషన్స్. రీసెంట్‌గా రిలీజైన పుష్ప-2 ట్రైలర్ సినిమాపై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. అసలు.. ఇప్పటకీ బన్నీ ఫ్యాన్స్ ఇంకా ఆ ట్రాన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతీ సినిమా లవర్ ఇప్పటికే ట్రైలర్‌ను రిపీటెడ్ మోడ్‌లో చూస్తున్నారు. భారీ ఎత్తున ట్రైలర్ విడుదల చేయగా, గాంధీ మైదానం మొత్తం పుష్పరాజ్ అభిమానులతో నిండిపోయింది. దాదాపు 2 లక్షల మంది వరకు హాజరయ్యారని చెబుతున్నారు. ఇసుకేస్తే రాలనంత మంది జనం. పుష్ప ట్రైలర్ కేవలం 15 గంటలలోపే 40 మిలియన్ ప్లస్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.
Pushpa 2 The Rule సస్పెన్స్ క్రియేట్ చేసిన షాట్..
ఒక ట్రైలర్ కి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం సౌత్ లో ఇదే తొలిసారి. ట్రైలర్ తోనే పుష్ప రాజ్ ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాడు. అసలు ట్రైలర్ సంగతి పక్కన పెట్టండి.. ఒక్క ఫ్రేమ్ తోనే దేశవ్యాప్తంగా పుష్పరాజ్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఆ ఫ్రేమ్ లో ఒక చితి ఉంది. అది పుష్పరాజ్ ది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నిజంగానే పుష్పరాజ్ చనిపోతాడా? గంధపు చెక్కలపై ఎవరిదో శవాన్ని కాలుస్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు. దీంతో ఆ కాలుతున్న శవం ఎవరిది? అని అందరూ ఆలోచిస్తున్నారు. ట్రైలర్ లో చూపించిన షాట్ లో ఓ శవం కాలుతుండగా.. వర్షంలో గొడుగులు పట్టుకొని దహన సంస్కారాలలో వందలాది మంది పాల్గొన్నారు.
ఎంపీ సిద్ధప్పనాయుడు (రావు రమేశ్), మంగళం శ్రీను (సునీల్), దాక్షాయణి (అనసూయ భరద్వాజ్) కూడా ఆ దహన సంస్కారాలలో పాల్గొనడంతో అందరిలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అంతమంది జనం ఉన్నారంటే, కచ్చితంగా ఈ సన్నివేశం సినిమాను మలుపు తిప్పే పాత్రదే అయి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సీన్ లో చనిపోయింది పుష్పరాజ్ అయి ఉంటాడు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. సినిమాలో ఆ స్థాయి ఎలివేషన్స్ ఇచ్చేంత క్యారెక్టర్ ఇంకెంకవరికి ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు. పుష్పరాజ్ చనిపోయినట్లు చూపించబోతున్నారు అని అభిప్రాయ పడుతున్నారు. అయితే అది నిజమైన మరణం కాదని.. పుష్పరాజ్ క్రియేట్ చేసిన ఫేక్ డెత్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. నిజానికి అది గనుక ఫేక్ డెత్ అయి ఉంటే మాత్రం.. సుకుమార్ ఏదో భారీగానే ప్లాన్ చేశాడు అని చెప్పచ్చు. ఇంకొందరు శ్రీవల్లి అంటున్నారు.