Allu Arjun : బ‌న్నీలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందా, ఎవ‌రు లేక‌పోతే అలా పిలుస్తార‌ట‌..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Allu Arjun : బ‌న్నీలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందా, ఎవ‌రు లేక‌పోతే అలా పిలుస్తార‌ట‌..!

Allu Arjun : గంగోత్రి సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన అల్లు అర్జున్ ఒక్కో మెట్టు ఎక్కుతూ వ‌చ్చి స్టైలిష్ స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా త‌ర్వాత ఆయ‌న‌కు ఐకాన్ స్టార్ బిరుదు ద‌క్కింది.పుష్ప సినిమాతో బ‌న్నీ నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్నాడు.ఇందులో బ‌న్నీ న‌ట విశ్వ‌రూపం ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఆయ‌న న‌టన‌ట‌కి దేశ విదేశాల‌కి చెందిన వారు కూడా ఫిదా అయి ప్ర‌శంస‌లు కురిపించారు. పాన్ ఇండియా స్టార్ హీరోగా మరింత పాపులారిటీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 April 2024,2:00 pm

Allu Arjun : గంగోత్రి సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన అల్లు అర్జున్ ఒక్కో మెట్టు ఎక్కుతూ వ‌చ్చి స్టైలిష్ స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా త‌ర్వాత ఆయ‌న‌కు ఐకాన్ స్టార్ బిరుదు ద‌క్కింది.పుష్ప సినిమాతో బ‌న్నీ నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్నాడు.ఇందులో బ‌న్నీ న‌ట విశ్వ‌రూపం ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఆయ‌న న‌టన‌ట‌కి దేశ విదేశాల‌కి చెందిన వారు కూడా ఫిదా అయి ప్ర‌శంస‌లు కురిపించారు. పాన్ ఇండియా స్టార్ హీరోగా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న బ‌న్నీ ప్రస్తుతం పుష్ప సీక్వెల్స్ తో బిజీగా ఉన్నాడు. పుష్ప‌2 ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి.

Allu Arjun : భార్యపై ప్రేమ వ‌చ్చిన‌ప్పుడు..

బ‌న్నీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మూవీ నుండి విడుద‌లైన టీజ‌ర్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇందులో బ‌న్నీ గెట‌ప్‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు. ఆయ‌న టాలెంట్ చూసి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఇక బన్నీ పుష్ప‌2 చిత్రం త‌ర్వాత అట్లీ డైరెక్షన్లో ఓ సినిమా చేయ‌నున్నార‌ని అర్ధ‌మ‌వుతుంది. ఇప్పుడు బ‌న్నీతో చాలా మంది ద‌ర్శ‌కులు సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా మ‌నోడు ఆచితూచి ప్రాజెక్ట్‌లు ఎంపిక చేసుకోబోతున్నాడ‌ని అంటున్నారు. బ‌న్నీ ఒక‌వైపు ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌తో హ్య‌పీగా ఉంటూ మ‌రోవైపు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బ‌న్నీ ఆమెతో చాలా జోవియ‌ల్‌గా ఉంటాడు.

Allu Arjun బ‌న్నీలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందా ఎవ‌రు లేక‌పోతే అలా పిలుస్తార‌ట‌

Allu Arjun : బ‌న్నీలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందా, ఎవ‌రు లేక‌పోతే అలా పిలుస్తార‌ట‌..!

స్నేహా రెడ్డి సినిమా ప‌రిశ్ర‌మ‌కి దూరంగా ఉన్నా కూడా ఆమె సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న క్రేజ్ అమాంతం పెంచేసుకుంది .. స్నేహ రెడ్డి తనకు తన భర్త పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమెను సోషల్ మీడియాలో అనుసరించే వారి సంఖ్య అధికంగా ఉందని చెప్పాలి. బ‌న్నీ- స్నేహా రెడ్డి జంట చాలా మందికి ఆద‌ర్శం అనే చెప్పాలి. అయితే అల్లు అర్జున్ సైతం తన భార్యను ముద్దుగా ఏమని పిలుచుకుంటారు అనేది చాలా మందిలో ఉంటుంది. స్నేహ రెడ్డిని క్యూటీ అంటూ చాలా క్యూట్ గా పిలుస్తారని తెలుస్తోంది. అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు కూడా తనని క్యూటీ అంటూ పిలుస్తూనే పోస్టులు చేస్తుంటారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది