Allu Arjun Family : అల్లు ఫ్యామిలీని పూర్తిగా దూరం పెట్టేసినట్టే.. క్లింకార బర్త్ డే వేడుకలతో బయటపడ్డ అసలు నిజం
ప్రధానాంశాలు:
Allu Arjun Family : అల్లు ఫ్యామిలీని పూర్తిగా దూరం పెట్టేసినట్టే.. క్లింకార బర్త్ డే వేడుకలతో బయటపడ్డ అసలు నిజం
Allu Arjun Family : మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య వైరం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారడం మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం. తన సొంత బంధువు జనసేనాని పవన్ కళ్యాణ్‌కు కాకుండ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, తన స్నేహితుడైన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి తరపున ప్రచారం చేశాడు. అదే ఇప్పుడు మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య మనస్పర్థలు కారణమైందనేది అందరి అభిప్రాయం. ఇది బయటకు చెప్పకపోయినా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాదని అనలేకపోతున్నారు.
Allu Arjun Family క్లారిటీ వచ్చేసింది..
పవన్ గ్రాండ్ విక్టరిని మెగా ఫ్యామిలీ మొత్తం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. అయితే ఈ వేడుకలో అల్లు ఫ్యామిలీ అసలు కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా అల్లు కుటుంబం నుంచి ఎవరూ రాలేదు. దీనిపై తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అంతేకాదు మెగా-అల్లు ఫ్యాన్స్ మధ్య కూడా వార్ నడుస్తుంది. ఈ విషయంలో మా హీరో ఎందుకు తగ్గాలి అంటే మా హీరో ఎందుకు తగ్గాలి అంటూ వాదించుకుంటున్నారు. దీంతో ఎవరూ ఎవరికి బ్రేక్ ఇచ్చారంటూ నెట్టింట ఫ్యాన్ వార్ మొదలైంది. చిరంజీవి వల్లే అల్లు అర్జున్‌కి బ్రేక్ వచ్చిందని.. అల్లు రామలింగయ్య గారి అల్లుడు అనే ట్యాగ్ లేకపోతే చిరంజీవి ఇండస్ట్రీలో ఎదిగే అవకాశం ఉండేదని కాదని ఫ్యాన్స్ మధ్య రచ్చ నడుస్తుంది.

Allu Arjun Family : అల్లు ఫ్యామిలీని పూర్తిగా దూరం పెట్టేసినట్టే.. క్లింకార బర్త్ డే వేడుకలతో బయటపడ్డ అసలు నిజం
ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు క్లింకారా ఫస్ట్ బర్త్ డేకి అల్లు ఫ్యామిలీ ఎవరు హాజరు కాకపోవడం చర్చనీయాంశం అయింది. క్లింకార బర్త్ డే పార్టీ వేడుకలో శ్రీజ, లావణ్య త్రిపాఠి, సుస్మిత వంటి వారు కూడా హాజరు కాగా అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఎక్కడా కనిపించలేదు. క్లింకార బర్త్‌డేతో మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య వైరంపై క్లారిటీ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ .. అల్లు అర్జున్, స్నేహారెడ్డిని అన్‌ఫాలో చేయడం మనకు తెలిసిందే.