Home » Entertainment » Allu Arjun Fans Fire On Jabardast Comedian Hyper Aadi
Entertainment

Hyper Aadi : హైపర్ ఆది పై కోపంతో రగిలి పోతున్న అల్లు అర్జున్‌ అభిమానులు

Authored By
Himanshi
The Telugu News | Published on: January 19, 2022, 11:00 am
Advertisement

Hyper Aadi : జబర్దస్త్‌ కామెడీ స్కిట్ లు రెగ్యులర్‌ గా వివాదం అవుతూనే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వర్గం వారిని అవమానించే విధంగా స్కిట్ చేశారంటూ కమెడియన్‌ లపై దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే కమెడియన్స్‌ పై దాడులు జరగడం చాలా కామన్‌ విషయంగా జరిగింది. ఏం జరిగినా కూడా కామెడీ విషయంలో మాత్రం జబర్దస్త్‌ కమెడియన్స్ తగ్గేదే లే అన్నట్లుగా ఈ పదేళ్లుగా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. జబర్దస్త్‌ కామెడీ షో సూపర్‌ హిట్‌ అవ్వడం లో కీలక పాత్ర పోషించింది స్కూప్స్‌ అనడంలో సందేహం లేదు. కొన్ని వందల సినిమాలను కామెడీ చేసి చూపించారు. తాజాగా హైపర్ ఆది పుష్ప సినిమాకు సంబంధించిన స్కిట్‌ చేశాడు. ఈ వారంలో ఆ స్కిట్‌ ను టెలికాస్ట్‌ చేయబోతున్నారు.

Advertisement

ఈ వారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఇప్పటికే విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుష్ప సినిమా ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న కారణంగా ఈ స్కిట్ ను కూడా చూస్తూ జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప స్కిట్‌ అద్బుతంగా వచ్చిందని ప్రోమో చూస్తుంటేనే అనిపిస్తుంది. హైపర్ ఆది ఏం చేసినా కూడా కచ్చితంగా అద్బుతంగా నవ్వించే విధంగా ఉంటుందని రోజా మరియు మనో లు అంటూనే ఉంటారు. ఇప్పుడు ఈ స్కిట్ కూడా ఖచ్చితంగా అదే తరహా లో వచ్చిందని అనిపిస్తుంది. కాని కొందరు దీనిపై విమర్శలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.అల్లు అర్జున్‌ పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్‌.. అలాంటి సినిమా ఇంకా థియేటర్‌ ల్లో ఉంది.

Allu Arjun fans fire on jabardast comedian Hyper Aadi

Advertisement

Hyper Aadi : పుష్ప ను అవమానించారు

ఈ సమయంలో కామెడీ స్కిట్‌ అంటూ పుష్ప పేరడీ చేయడం ద్వారా అల్లు అర్జున్ ను అవమానించడం అంటూ విమర్శలు చేస్తూ కొందరు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ బయలు జేరారు. హైపర్‌ ఆదిని వారు బూతులు తిడుతూ ఈ వారంలో ఆ స్కిట్‌ ను కనుక టెలికాస్ట్‌ చేస్తే తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. పెద్ద ఎత్తున పుష్ప సినిమాకు సంబంధించిన వసూళ్లు నమోదు అవుతున్న సమయంలో బూతుల కామెడీ షో లో పుష్ప ను చూపించడం అంటే మా పుష్ప ను అవమానించడమే అంటూ వారు వింత గా వాదిస్తున్నారు. మరి దీనికి హైపర్ ఆది ఎలా రియాక్ట్‌ అవుతాడు అనేది చూడాలి. మెజార్టీ బన్నీ అభిమానులు మాత్రం ఆది వైపు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆది చేసింది కామెడీ కాని పరువు తక్కువ పని కాదు అనడంలో సందేహం లేదు.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి