Allu Arjun : అల్లు అర్జున్‌కి ఊరట… రెగ్యులర్ బెయిల్ మంజూరు, కాని..!
ప్రధానాంశాలు:
Allu Arjun : అల్లు అర్జున్‌కి ఊరట... రెగ్యులర్ బెయిల్ మంజూరు, కాని..
Allu Arjun : పుష్ప2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కు వెళ్లి తొక్కిసలాటకు, ఓ మహిళ మృతికి కారకులయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో దానిపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్న అల్లు అర్జున్ విషయంలో పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. అదే సమయంలో నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.
Allu Arjun బయటపడ్డాడు…
సంధ్య థియేటర్ ఘటన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను ఏ11గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు నాలుగువారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. రూ. 50 వేల రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. రిమాండ్ ముగిసిన నేపథ్యంలో ఇటీవల జరిగిన కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు.
అదే రోజున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేయగా, కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. Allu Arjun కి రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు.. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వెల్లడించారు.