Allu Arjun : అల్లు అర్జున్‌తో కొరటాల శివ సినిమా.. స్క్రిప్ట్ డిస్కషన్‌లో ఆ ఇద్దరు..!
ప్రధానాంశాలు:
Allu Arjun : అల్లు అర్జున్‌తో కొరటాల శివ సినిమా.. స్క్రిప్ట్ డిస్కషన్‌లో ఆ ఇద్దరు..!
Allu Arjun : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప2 చిత్రంతో ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అతను మూడు సంవత్సరాలు వెచ్చించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు కాస్త విరామం తీసుకుంటున్నాడు. ఈ చిత్రం యొక్క భారీ విజయం, ముఖ్యంగా హిందీలో, దానితో సహకరించాలనుకునే బాలీవుడ్ చిత్రనిర్మాతల దృష్టిని కూడా ఆకర్షించింది. అయితే తర్వాతి ప్రాజెక్ట్ గా బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పని చేయనున్నారు, అదే సమయంలో దేశవ్యాప్తంగా చిత్రనిర్మాతలతో వివిధ ప్రాజెక్ట్‌లను సెట్ చేసే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ ఇటీవల అల్లు అర్జున్‌ను కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేశారట…
Allu Arjun క్రేజీ కాంబో..
అది విన్న బన్నీ స్క్రిప్ట్ డెవలప్ చేయమని అన్నారట. ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, కొరటాల శివ దానిపై చురుగ్గా పని చేస్తున్నాడట. ఇప్పుడు స్క్రిప్ట్ ఆకట్టుకుంటే ఈ డైనమిక్ ద్వయం కలిసి వస్తుందనే ఆశ ఉంది. కమర్షియల్ హీరోతో మంచి సందేశాత్మక సినిమాలను చేయగల దర్శకుడు కొరటాల శివ అల్లు అర్జున్ లాంటి బడా హీరోతో మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి గత సినిమాల కంటే హై రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక సినిమాలో ముఖ్యంగా మంచి నీటికి సంబంధించిన అంశంపై కథ నడుస్తుందట. మంచి నీళ్ల విలువ తెలిసేలా మరోసారి స్ట్రాంగ్ మెస్సేజ్ ఇవ్వడానికి కొరటాల పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీతో సిద్ధమైనట్లు సమాచారం. అలాగే పొలిటికల్ యాంగిల్ కూడా ఉంటుందట.
కొరటాల శివ మెగాస్టార్ తో ఆచార్య సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ఎన్టీఆర్‌తో కలిసి దేవర అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాతో రచ్చ చేశాడు. వచ్చే ఏడాది ఆగస్ట్ సమయానికి ఇద్దరు ఫ్రీ అవుతారు కాబట్టి కూల్ గా సెప్టెంబర్ లో లేదా అక్టోబర్ లో సినిమాను స్టార్ట్ చేయవచ్చని సమాచారం. ఇక సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సమ్మర్ కు ఉండవచ్చని టాక్.