Allu Arjun : అల్లు అర్జున్ ను హర్ట్ చేసిన మెగా హీరో.. తన భార్యతో పదే పదే అలా అనేసరికి..?
Allu arjun : ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అన్నింటిలోనూ టాప్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ కుటుంబం నుంచి ఏడుగురు హీరోలు ఉన్నారు. కానీ వీరిలో ముగ్గురు మాత్రమే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అల్లు కుటుంబం నుంచి అల్లు అర్జున్ చిరంజీవి తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఆయన సినిమాలకు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ వచ్చేసింది. ఇండస్ట్రీలో ప్రభాస్ తర్వాత భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో అల్లు అర్జున్ ఒకరు. మెగా కంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో రాంచరణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ మినహా మిగతా హీరోలు ఇండస్ట్రీలో ఇంకా గుర్తింపు సంపాదించుకోలేదు.
వారి ఐడెంటిటి కోసం చాలా కష్టపడుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ అండతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బన్నీ తన టాలెంట్‌తో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. అల్లు రామలింగయ్య మనవడిగా.. బడా నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా సినిమా రంగంలో అడుగుపెట్టిన బన్నీ అంచెలంచెలుగా ఎదిగాడు. ఇక తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకుంటే బన్నీకి తన భార్య స్నేహరెడ్డి అంటే చాలా ఇష్టం. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. లవ్ కమ్ అరెంజ్ అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్‌కు తన భార్య మీద ఎంత ప్రేమ ఉందంటే ఎక్కడకు వెళ్లినా ఆమెను తీసుకుని వెళ్తాడు.

Allu Arjun Hurt to mega hero
Allu arjun : తన భార్యతో అలా అనేసరికి..
తన మూకి ఆడియో లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ ఇలా అన్నింటిలోనూ ఆమె కనిపిస్తారు. ఇక పండుగల వేళ మెగాకుటుంబం మొత్తం కలిసి ఇంట్లో కలిసిమెలిసి పండుగ చేసుకుంటారు. అప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం అటెండ్ అవుతుంది. ఇలా ఓ సారి కలిసిన టైంలో ఒక మెగాహీరో స్నేహరెడ్డిని ఆటపట్టించాడట.. ‘నువ్వు హీరోయిన్ కంటే బాగుంటావని.. సినిమాలు చేస్తే మీ ఆయన కంటే ఎక్కువ పాపులారిటీ వస్తుందని పలుమార్లు ఆటపట్టించాడట’. ఇదే విషయాన్ని బన్నీకి చెప్పుకుని స్నేహ ఫీల్ అయ్యిందట.. బన్నీ మాత్రం అతన్ని ఏమనకపోయినా మనసులో అతనంటే కోపం ఉందని వార్తలు వస్తున్నాయి.