Allu arjun : అల్లు అర్జున్ నోట్లో బీడీ.. ఊర మాస్ అంటే ఊరమాస్ ..!
Allu arjun : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. పుష్ప అన్న టైటిల్ తో తెరకెక్కుతుండంగా మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ.. తమిళం.. మలయాళం.. కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా అదీ కాకా అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

allu-arjun-in-a-trendy-mass-look
ఇక ఈ సినిమాతో సుకుమార్ – అల్లు అర్జున్ బాలీవుడ్ మార్కెట్ మీద కూడా పట్టు సాధించాలని కసితో ఉన్నారు. ప్రభాస్ రేంజ్ లో అల్లు అర్జున్.. రాజమౌళి రేంజ్ లో సుకుమార్ పాన్ స్టార్స్ గా పాపులారిటీ దక్కించుకోవాలని తాపత్రయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగా పుష్ప సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా సుకుమార్ ప్రతీ షాట్ ని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరగుతుండగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ సాగుతుందని సుకుమార్ చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే.
Allu arjun : చిరంజీవి ముఠామేస్త్రీ, రౌడీ అల్లుడు సినిమాలలో ఇలానే బీడీ కాల్చుతూ కనిపించాడు.
ఇక ప్రత్యేకంగా అల్లు అర్జున్ మేకోవర్ పుష్ప సినిమాకి చాలా హైలెట్ అవుతుందని బయటకి వస్తున్న ఒక్కో ఫొటోతో తెలుస్తోంది. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుతూ వస్తున్నారు. తాజాగా పుష్ప నుంచి అల్లు అర్జున్ కి సంబంధించిన మరొక లుక్ బయటకి వచ్చింది. ఈ లుక్ లో అల్లు అర్జున్ నోట్లో బీడీ పెట్టుకొని మాస్ కంటే ఊర మాస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ముఠామేస్త్రీ, రౌడీ అల్లుడు సినిమాలలో ఇలానే బీడీ కాల్చుతూ కనిపించాడు. ఈ సీన్స్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దానికి మించి అల్లు అర్జున్ పుష్ప లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. చూడాలి మరి పుష్ప అల్లు అర్జున్ కెరీర్ లో ఎలాంటి సక్సస్ ని ఇస్తుందో.