Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్ సిద్ధమా.. పుష్ప 2 మీద భయంకరమైన అప్డేట్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్ సిద్ధమా.. పుష్ప 2 మీద భయంకరమైన అప్డేట్ !

Allu Arjun : ప్రస్తుతం ‘ పుష్ప 2 ‘ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. సుకుమార్, అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. దీంతో పుష్ప సీక్వెల్ గా రూపొందిస్తున్న పుష్ప 2 అని 1000కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ సినిమాగా భారీ అంచనాలతో తెరకెక్కబోతుంది. ఇక […]

 Authored By prabhas | The Telugu News | Updated on :17 March 2023,10:00 pm

Allu Arjun : ప్రస్తుతం ‘ పుష్ప 2 ‘ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. సుకుమార్, అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. దీంతో పుష్ప సీక్వెల్ గా రూపొందిస్తున్న పుష్ప 2 అని 1000కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ సినిమాగా భారీ అంచనాలతో తెరకెక్కబోతుంది. ఇక పుష్ప 2 లో రష్మిక మందన పాత్ర చాలా తక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం సుకుమార్ విదేశాలకు వెళ్లారు.

Allu Arjun in pushpa 2 movie update

Allu Arjun in pushpa 2 movie update

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా కోసం చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చిందని టాక్. ఈ ఫైట్ సీక్వెన్స్ మూవీ మొత్తానికి హైలెట్ గా ఉండబోతుందని ప్రచారం నడుస్తుంది. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ డాన్ గా కనిపిస్తారట. దీంతో ఈ సినిమాలో అల్లు అర్జున్ రిచ్ కాస్ట్యూమ్ లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. అలాగే పుష్పాలు ఐటమ్ సాంగ్ కు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. దీంతో పార్ట్ 2 లో కూడా స్టార్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ ఉండబోతున్నట్లు సమాచారం.

Pushpa 2 | Official Concept Trailer | Allu Arjun | Rashmika | Sukumar |  Mythri Movies | Upcoming - YouTube

అలాగే ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు ఫిలింనగర్లో టాక్ నడుస్తుంది. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ఆగస్టు చివరిలోగా అయిపోతుందని టాక్. ఇక అల్లు అర్జున్ బర్త్ డే వచ్చే నెల ఏడవ తారీఖున కాబట్టి ఆయన బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా అయిపోగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది