
allu arjun in troubles
Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు.పుష్ప చిత్రంతో ఆయన క్రేజ్ విదేశాలకు కూడా పెరిగింది. త్వరలో పుష్ప 2తో పలకరించబోతున్నాడు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు యాడ్స్‌లో నటిస్తుంది. అయితే ఇటీవల బన్నీ నటిస్తున్న యాడ్స్ కాంట్రవర్షియల్‌గా మారుతున్నాయి. అల్లు అర్జున్ నటించిన ఓ కమర్షియల్ యాడ్‌పై కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఆయన శ్రీ చైతన్య విద్యాసంస్థల కోసం ఓ వ్యాపార ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని సామాజికి కార్యకర్త కొత్త ఉపేందర్‌రెడ్డి ఆరోపించాడు.
అంతేకాదు ఇందులో నటించిన అల్లు అర్జున్, తప్పుడు సమాచారం ఇచ్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఆయన అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే అల్లు అర్జున్ చేసిన రాపిడో యాడ్‌పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య అల్లు అర్జున్ చేసిన రాపిడో యాడ్‌లో సిటీ బస్సుల గురించి చూపించడంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్పట్లో ఫైర్ అయ్యారు. ఇది వెంటనే తొలగించక పోతే బన్నీపై, రాపిడో సంస్థపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో అల్లు అర్జున్ చేసిన జొమాటో యాడ్ కూడా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.
allu arjun in troubles
ఇలా బన్నీ చేసిన పలు యాడ్ షూట్స్ కాంట్రవర్సీ అవుతుండటం ఆయన అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అల్లు అర్జున్‌కి యాడ్ షూట్స్ పెద్దగా కలసిరావడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా పుష్ప మూవీతో ఒక్కసారిగా బన్నీ క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా బ్రాండ్ వ్యాల్యు కూడా భారీగా పెరిగింది. దీంతో పలు వ్యాపార సంస్థలకు బన్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. వాణిజ్య ప్రకటనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. అనేక బ్రాండ్లను ప్రమోషన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బన్నీ తరచూ చేదు అనుభవం చూస్తున్నాడు. ఇప్పటికే జొమాటో, ర్యాపిడో ప్రకటనలో నటించి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.