Allu arjun Nagababu : వాళ్లు అంతా ఒక‌టే.. ఫ్యాన్సే పిచ్చోళ్లా.. నాగ‌బాబు, బ‌న్నీ మీటింగ్ త‌ర్వాత ఇదే చ‌ర్చ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu arjun Nagababu : వాళ్లు అంతా ఒక‌టే.. ఫ్యాన్సే పిచ్చోళ్లా.. నాగ‌బాబు, బ‌న్నీ మీటింగ్ త‌ర్వాత ఇదే చ‌ర్చ‌

 Authored By ramu | The Telugu News | Updated on :16 December 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Allu arjun Nagababu : వాళ్లు అంతా ఒక‌టే.. ఫ్యాన్సే పిచ్చోళ్లా.. నాగ‌బాబు, బ‌న్నీ మీటింగ్ త‌ర్వాత ఇదే చ‌ర్చ‌

Allu arjun Nagababu : గ‌త కొద్ది రోజులుగా బ‌న్నీ వ్య‌వ‌హారం నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. పుష్ప సినిమా విడుదల రోజున ప్రీమియర్స్ షో సమయంలో విషాద ఘటన తీవ్ర దుమారం రేగింది. హైదరాబాద్ సంధ్య థియేటర వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఓ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీంతో బాధిత కుటుంబం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేయగా కేసు నమోదైంది. మొదటగా థియేటర్ యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఈ కేసులో హీరో అల్లు అర్జున్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాతి రోజు బెయిల్ మీద విడుద‌ల‌య్యారు.

Allu arjun Nagababu వాళ్లు అంతా ఒక‌టే ఫ్యాన్సే పిచ్చోళ్లా నాగ‌బాబు బ‌న్నీ మీటింగ్ త‌ర్వాత ఇదే చ‌ర్చ‌

Allu arjun Nagababu : వాళ్లు అంతా ఒక‌టే.. ఫ్యాన్సే పిచ్చోళ్లా.. నాగ‌బాబు, బ‌న్నీ మీటింగ్ త‌ర్వాత ఇదే చ‌ర్చ‌

Allu arjun Nagababu వాళ్లు వాళ్లు ఒక‌టే..

ఆ స‌మ‌యంలో బ‌న్నీకి కొంద‌రు స‌పోర్ట్ అందిస్తే మ‌రి కొంద‌రు మాత్రం విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో తన మామ పవన్ కళ్యాణ్ జనసేనకు కాకుండా వైసీపీ నేతకు ప్రచారం చేసిన దగ్గర్నుంచి బన్నీ వార్తల్లోనే ఉంటున్నాడు. వైసీపీ నేతకు ప్రచారం, దాని గురించి మాట్లాడటం, ఆ తర్వాత పుష్ప 2 భారీ ఈవెంట్స్, పుష్ప ప్రీమియర్స్ లో ఓ మహిళ చనిపోవడం, అల్లు అర్జున్ ఆ కేసులో జైలుకు వెళ్లి రావడం.. ఇలా గత కొన్నాళ్లుగా అల్లు అర్జున్ పేరు హాట్ టాపిక్ అవుతుంది. ఓ సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పను అనేటప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గొడవ సోషల్ మీడియాలో ఇంకా సాగుతూనే ఉంది.

ఆ గొడవకు ఇంకొంచెం ఆజ్యం పోసేలాగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్ ఫాలో చెయ్యడం, నాగబాబు బన్నీ పై ఇండైరెక్ట్ కౌంటర్లు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఫ్యాన్స్ మధ్యే కాదు మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య కూడా సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. మెగా ఫ్యామిలీలు కూడా బన్నీని పట్టించుకోవట్లేదని వినిపించింది. అసలు పుష్ప 2 సినిమాపై అందరూ ప్రశంసిస్తుంటే మెగా హీరోలు ఎవ్వరూ దాని ఊసెత్తకపోవడం గమనార్హం. ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఇంటికి వచ్చినప్పుడు కూడా టాలీవుడ్ స్టార్స్ అంతా బన్నీ ఇంటికి వెళ్లి పలకరించి వచ్చారు. కానీ మెగా హీరోలు ఎవ్వరూ వెళ్ళలేదు. మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ మేనత్త, చిరంజీవి భార్య సురేఖ గారు మాత్రం వెళ్లి బన్నీని కలిసి వచ్చారు. దీంతో హాట్ డిస్క‌ష‌న్ న‌డుస్తున్న వేళ అల్లు అర్జున్ సడెన్ గా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి స్వయంగా క‌లిసారు. ఆ త‌ర్వాత అల్లు అర్జున్ స్వయంగా నాగబాబు ఇంటికి వెళ్లి నాగబాబుని కలిసాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇన్నాళ్లు ఏదో జ‌రుగుతుంద‌ని ఊహించుకున్న ఫ్యాన్స్ పిచ్చోళ్ల‌య్యారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది