Allu Arjun : అల్లు అర్జున్ అసలు ఇలా ఎందుకు చేశాడు.. ఆరు బ్లాక్ బాస్టర్స్ పోయాయిగా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : అల్లు అర్జున్ అసలు ఇలా ఎందుకు చేశాడు.. ఆరు బ్లాక్ బాస్టర్స్ పోయాయిగా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :29 August 2022,8:20 pm

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా అవతరించిన విషయం తెలిసిందే. కానీ తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఏకంగా 20 ఏళ్లు కష్టపడాల్సి వచ్చిందట.. బన్నీ సినిమాల్లో చాలా మంది చూసేది అతని డ్యాన్స్. దానితోనే స్టైలీష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో స్టోరీ డిమాండ్ చేస్తే ఎలాంటి రోల్స్ అయినా పోషించేందుకు సై అంటున్నాడట బన్నీ.. ఇదిలాఉంటే బన్నీ తన కెరీర్‌లో చాలా హిట్స్ సినిమాలను వదులుకున్నాడు. దర్శకుడు ఇంత బాగా తీస్తారని తెలియకే సినిమాలు వదులుకున్నాడా? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.

Allu Arjun : మొత్తం 12 అందులో 6 సూపర్ హిట్స్..

అల్లు అర్జున్‌ను ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేయాలనుకున్న టైంలో అల్లు అర‌వింద్‌కు తేజ జయం సినిమా కథ చెప్పాడట.. అందుకు అర‌వింద్ కూడా ఓకే అన్నారట.. కానీ అనుకోకుండా ఈ క‌థ నితిన్‌కు చేర‌డంతో మనోడు తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు.ఇక బోయ‌పాటి శ్రీను భ‌ద్ర క‌థ‌ను ముందుగా అల్లు అర్జున్‌కు చెప్పారట. కానీ అప్పుడే ఆర్య లాంటి ప్రెష్ స్టోరీ చేస్తూ వెంట‌నే యా‌క్ష‌న్ సినిమా చేస్తే జనాలు రీసివ్ చేసుకుంటారో లేదో అని బన్నీ వద్దనడంతో అది కాస్త ర‌వితేజకు వెళ్లిపోయింది. ఇక సుకుమార్ 100 % ల‌వ్‌ స్టోరీని ముందుగా బ‌న్నీకి చెప్పాడట.ఈ సాఫ్ట్ ల‌వ్ స్టోరీస్ త‌న‌కు క‌నెక్ట్ కావ‌ని చెప్ప‌డంతో చివ‌ర‌కు అర‌వింద్ నిర్మాత‌గా నాగ చైత‌న్యతో చేసి హిట్ కొట్టాడు సుకుమార్.

Allu Arjun Missed 6 Block Buster Movies IN Telugu

Allu Arjun Missed 6 Block Buster Movies IN Telugu

టాలీవుడ్ సూపర్ హిట్ గీత గోవిందం మూవీ విజయ్‌కు లైఫ్ ఇచ్చింది. ఈ స్టోరీని పరుశురాం ముందుగా బన్నీకి చెప్పాడట..అతను నో చెప్పడంతో ఈ హిట్ కాస్త విజయ్ చేతికి వెళ్లిపోయింది. అర్జున్ రెడ్డి సినిమా కథను ముందుగా సందీప్ రెడ్డి వంగా అల్లు అర్జున్‌గా చెప్పగా..ఎందుకో ఇది చేయడానికి బన్నీకి దైర్యం చాలలేదట..ఆ తర్వాత ఇది విజయ్ దగ్గరకు చేరడంతో మనోడు బ్లాక్ బాస్టర్ కొట్టి టాలీవుడ్‌కు రౌడీ బాయ్‌గా ఎదిగాడు.అదేవిధంగా బన్నీ వద్దనుకున్న సినిమాల్లో కృష్ణాష్టమి, పండగ చేస్కో,గ్యాంగ్ లీడర్,డిస్కో రాజా, జాను, బొమ్మరిల్లు, సుప్రీమ్ వంటి సినిమాలు కూడా ఉండటం గమనార్హం.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది