Allu Arjun : చిల్ అవుతున్న బన్నీ.. కూతురితో అల్లు అర్జున్ ఆటలు
Allu Arjun : టాలీవుడ్ స్టైలీష్ స్టార్.. ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అయిపోయాడు. సుకుమార్ ఇచ్చిన ట్యాగ్ అంటూ సినిమా విడుదల కాకముందే ఐకాన్ స్టార్ అని ట్యాగ్ వేయించుకున్నాడు. అది కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈ మధ్య తండ్రీకూతుళ్లు ఇద్దరూ కూడా షూటింగ్‌లతో బిజీగా అయ్యారు. అల్లు అర్హ, బన్నీ ఇద్దరూ కూడా సెట్స్‌లోనే గడిపేశారు. సమంత శాకుంతలం సినిమాలో అర్హ వేసిన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొన్ననే పూర్తయింది.

Allu Arjun Palys With Allu Arha
భరతుడి పాత్రలో అర్హ అదరగొట్టేసిందని యూనిట్ చెప్పేసింది. శాకుంతలం సెట్ పక్కనే పుష్ప షూటింగ్ కూడా జరిగిందట. అలా బన్నీ, అర్హలు పక్కపక్కనే షూటింగ్ జరుపుకున్నారు. దీనిపై బన్నీ స్పందిస్తూ.. ఇలాంటి ఘటన ఓ ఇరవై ఏళ్ల తరువాత వస్తుందని అనుకున్నాను. కానీ ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక అర్హ షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇప్పుడు ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
Allu Arjun : చిల్ అవుతున్న బన్నీ.. కూతురితో అల్లు అర్జున్ ఆటలు
మామూలుగానే బన్నీ తన పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతుంటాడు. తాజాగా బన్నీ, అర్హలు ఆడుకుంటున్న వీడియోను అల్లు స్నేహారెడ్డి షేర్ చేశారు. దీంట్లో బన్నీ బుడగలు ఊదుతుంటే.. అర్హ తెగ ఎంజాయ్ చేస్తోంది. మొత్తానికి సెట్స్‌లో అలా ఎంజాయ్ చేసిన ఈ తండ్రీకూతుళ్లు ఇంట్లో ఇలా సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్అవుతోంది. ఇక బన్నీ పుష్ప మొదటి పార్ట్ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా వచ్చేందుకు రెడీ అవుతోంది.
View this post on Instagram