Allu Arjun: గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై చర్చ జరగడంతో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినిమా ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ నాపై అన్ని తప్పుడు ఆరోపణలు చేసారని అన్నారు. అలాగే.. పుష్ప పెద్ద సక్సెస్ అయింది. పుష్ప సక్సెస్ మీట్స్ చాలా చోట్ల ప్లాన్ చేసాము. కర్ణాటక, ఢిల్లీ, ముంబై.. ఇలా చాలా చోట్ల సక్సెస్ మీట్స్ అనుకున్నాము. కానీ ఇలా జరిగింది అని తెలిసిన తర్వాత అన్ని సక్సెస్ మీట్స్, సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేశాను. పదిహేను రోజులుగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉన్నాను అని అన్నారు.
బన్నీ ఎమోషనల్..
అల్లు అర్జున్ తప్పు చేశాడు, అరెస్ట్ అయ్యాడు. ఆయనకు కన్ను పోయిందా? కాలిపోయిందా?, ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని కలిసి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఏమిటీ? ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ గురించి ఎవరైనా ఆలోచించారా? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తాడు. రేవంత్ రెడ్డి విమర్శల నేపథ్యంలో అల్లు అర్జున్ శనివారం మీడియా సమావేశంలో చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు.నేను చాలా చింతిస్తున్నాను. అయితే నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను నేను తీసుకోలేకపోతున్నాను. క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉందని స్టాఫ్ తెలిపిన వెంటనే నేను థియేటర్ నుండి బయటకు వచ్చేశాను. నాకు కూడా పిల్లలు ఉన్నారు. శ్రీతేజ్ నా కుమారుడితో సమానం అన్నారు.
అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అనంతరం సోషల్ మీడియాలో ఈ ఇష్యూ గురించి తీవ్రమైన చర్చ నడుస్తుంది. అంతేకాదు అల్లు అర్జున్ అరెస్టెడ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరి కొందరు యాంటీ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటర్వెల్ వరకు థియేటర్లో ఉన్నారంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ మహిళ చనిపోయిన విషయం ఆయనకు చెప్పలేదని కౌంటర్లు ఇస్తున్నారు. కాగా, శ్రీ తేజ్ కోలుకుంటున్నాడని తెలిసి చాలా సంతోషించానని, సంధ్య థియేటర్ ఘటన నిజంగా అత్యంత దురదృష్టకరం అని అల్లు అర్జున్ అన్నారు. ప్రేక్షకులను ఆనందింప చేయాలనే ఆలోచనే ఉందని, థియేటర్ అంటే నాకు దేవాలయం వంటిదన్నారు. అలాంటి థియేటర్‌లో ఇలాంటి ఘటన జరగడం ఎంతో బాధేసిందన్నారు.
CV Anand | గత కొద్ది రోజులుగా సంధ్య థియేటర్ ఇష్యూ చర్చనీయాంశంగా మారడం మనం చూశాం. ఇందులో బాద్యులు…
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో శంకర్ తెరకెక్కించిన…
KCR : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారడం మనం చూశాం. కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించేలా తెలంగాణ ప్రభుత్వం పావులు…
Venu Yellamma : బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వేణు యెల్దండి తన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ…
Milk : ప్రతిరోజు పాలు తాగటం ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిన విషయమే. పాలు ఎన్ని తాగాలో అన్నదానికంటే.. ఏ…
Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ సినిమాలు ఆపేస్తుందా పెళ్లి తర్వాత కథానాయికలు కొన్నాళ్లు కెరీర్ బ్రేక్ తీసుకోవడం…
Long Hair : మహిళలు పొడవైన జుట్టు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మందంగా,దృఢంగా, నల్లగా జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు.…
Ram Charan : గ్లోబల్ స్టార్ రాం చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా 2025 సంక్రాంతికి…
This website uses cookies.