Allu Arjun: ప్రెస్ మీట్ అనంత‌రం అల్లు అర్జున్ త‌ప్పు చేశాడా లేదా అనే దానిపై జోరుగా చ‌ర్చ‌

 Authored By sandeep | The Telugu News | Updated on :22 December 2024,4:53 pm

Allu Arjun:  గ‌త కొద్ది రోజులుగా అల్లు అర్జున్ వ్య‌వ‌హారం నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీలో సంధ్య థియేట‌ర్ ఘటనపై చర్చ జరగడంతో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినిమా ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ నాపై అన్ని తప్పుడు ఆరోపణలు చేసారని అన్నారు. అలాగే.. పుష్ప పెద్ద సక్సెస్ అయింది. పుష్ప సక్సెస్ మీట్స్ చాలా చోట్ల ప్లాన్ చేసాము. కర్ణాటక, ఢిల్లీ, ముంబై.. ఇలా చాలా చోట్ల సక్సెస్ మీట్స్ అనుకున్నాము. కానీ ఇలా జరిగింది అని తెలిసిన తర్వాత అన్ని సక్సెస్ మీట్స్, సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేశాను. పదిహేను రోజులుగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉన్నాను అని అన్నారు…

Allu Arjun: ప్రెస్ మీట్ అనంత‌రం అల్లు అర్జున్ త‌ప్పు చేశాడా లేదా అనే దానిపై జోరుగా చ‌ర్చ‌

Allu Arjun: ప్రెస్ మీట్ అనంత‌రం అల్లు అర్జున్ త‌ప్పు చేశాడా లేదా అనే దానిపై జోరుగా చ‌ర్చ‌

బ‌న్నీ ఎమోష‌న‌ల్..

అల్లు అర్జున్ తప్పు చేశాడు, అరెస్ట్ అయ్యాడు. ఆయనకు కన్ను పోయిందా? కాలిపోయిందా?, ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని కలిసి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఏమిటీ? ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ గురించి ఎవరైనా ఆలోచించారా? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తాడు. రేవంత్ రెడ్డి విమర్శల నేపథ్యంలో అల్లు అర్జున్ శనివారం మీడియా సమావేశంలో చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడాడు.నేను చాలా చింతిస్తున్నాను. అయితే నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను నేను తీసుకోలేకపోతున్నాను. క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉందని స్టాఫ్ తెలిపిన వెంటనే నేను థియేటర్ నుండి బయటకు వచ్చేశాను. నాకు కూడా పిల్లలు ఉన్నారు. శ్రీతేజ్ నా కుమారుడితో సమానం అన్నారు.

అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అనంతరం సోషల్ మీడియాలో ఈ ఇష్యూ గురించి తీవ్ర‌మైన చ‌ర్చ న‌డుస్తుంది. అంతేకాదు అల్లు అర్జున్ అరెస్టెడ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. మ‌రి కొంద‌రు యాంటీ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటర్వెల్ వరకు థియేటర్లో ఉన్నారంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ మహిళ చనిపోయిన విషయం ఆయనకు చెప్పలేదని కౌంటర్లు ఇస్తున్నారు. కాగా, శ్రీ తేజ్ కోలుకుంటున్నాడని తెలిసి చాలా సంతోషించానని, సంధ్య థియేటర్ ఘటన నిజంగా అత్యంత దురదృష్టకరం అని అల్లు అర్జున్ అన్నారు. ప్రేక్షకులను ఆనందింప చేయాలనే ఆలోచనే ఉందని, థియేటర్ అంటే నాకు దేవాలయం వంటిదన్నారు. అలాంటి థియేటర్‌లో ఇలాంటి ఘటన జరగడం ఎంతో బాధేసిందన్నారు.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి