Allu Arjun : అల్లు అర్జున్‌ని చుట్టు ముట్టేస్తున్న కష్టాలు.. బన్నీ కోసం మృత్యుంజయ హోమం : వేణు స్వామి
ప్రధానాంశాలు:
Allu Arjun : అల్లు అర్జున్‌ని చుట్టు ముట్టేస్తున్న కష్టాలు.. బన్నీ కోసం మృత్యుంజయ హోమం : వేణు స్వామి
Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయంలో అల్లు అర్జున్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టై.. బెయిల్ పై బయటకు వచ్చిన సినీ హీరో అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇప్పటికీ ముగిసేలా లేదు. ప్రతీ రోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. రీసెంట్‌గా అతడికి మరోసారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీని వెనకాల ఎలాంటి ఉద్దేశ్యం ఉందో తెలియదు కానీ.. అతడికి పొలిటికల్ మైలేజ్ వస్తుందనే కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతడి గురించి మాట్లాడకపోవడమే మంచిదని.. ఏదైనా ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్ల తెలుస్తోంది.
Allu Arjun ఏం జరుగుతుంది..
ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ చికిత్స చూసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో అల్లు అర్జున్ రూ 25 లక్షల సాయం ప్రకటించారు. పుష్ఫ -2 టీం నుంచి రూ 2 కోట్లు బాధిత కుటుంబానికి ఇస్తున్న ట్లు వెల్లడించారు. ప్రకటించిన ఆర్దిక సాయం లో అల్లు అర్జున్ రూ. కోటి, సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ఇస్తున్నట్లు వివరించారు. సుకుమార్ ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు.
బాలుడి తండ్రి సైతం తమకు అందిన సాయం గురించి వివరించారు. బాలుడు కోలుకోవాలని కోరుకుంటున్నట్లు అల్లు అరవింద్ ఆకాంక్షించారు. ఇటు, దిల్ రాజు ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ… సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమన్నారు. అయితే చట్టం అందరికీ సమానంగా ఉండాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై సీఎం మాట్లాడిన తీరును తప్పుబట్టారు. ఆయన మాటల్లో ఎక్కడా తటస్థత కనిపించలేదని విమర్శించారు. ఇదిలా ఉంటే గతంలో సినీ పరిశ్రమపై పలు విమర్శలు చేసే వేణు స్వామి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను కూడా సినిమా సొమ్ము తిన్నవాడినే కాబట్టి నా వంతు సహాయంగా నా సొంత డబ్బులతో బాబు కోసం మృత్యుంజయ హోమం నిర్వహిస్తాను.. పాప కోసం 2 లక్షలు ఇస్తున్నాను అంటూ వేణు స్వామి కామెంట్స్ చేశారు. Allu Arjun pushpa 2 team announces rs 2cr financial support for revanthi family