Pushpa 2 The Rule Public Talk : పుష్ప2 పబ్లిక్ టాక్ .. దద్దరిల్లిపోతున్న థియేటర్స్.. కానీ.. టికెట్ రేట్స్ తగ్గించు అన్నా..!
Pushpa 2 The Rule Public Talk : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం పుష్ప2 ది రూల్. భారీ అంచనాల విడుదలైన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల కూడా మంచి టాక్ సంపాదించుకుంటుంది. ‘పుష్ప-2’ గురువారం రాత్రి 9.30 గంటలకుస్పెషల్ ప్రీమియర్స్ తో విడుదల అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సిగింల్ స్క్రీన్ థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది పుష్ప -2. ఎటు చుసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి.థియేటర్స్ లో పుష్ప- 2 చూసి బయటకు వస్తున్న జనం అయితే పూనకాలెత్తిపోతున్నారు. ఇది బన్నీ ర్యాంపేజ్ అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు.
Pushpa 2 The Rule Public Talk : పుష్ప2 పబ్లిక్ టాక్ .. దద్దరిల్లిపోతున్న థియేటర్స్.. కానీ.. టికెట్ రేట్స్ తగ్గించు అన్నా..!
పుష్ప సినిమా చూసిన ఆడియన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇది పుష్పగాడి ప్రభంజనం, ఫైర్ ఫైర్ అంటూ తెగ హల్చల్ చేస్తున్నారు. ఈ మూవీ అంచనాలను మించి ఉందని, అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ అయితే పిచ్చెక్కించిందని చెబుతున్నారు. ఈ ఒక్క సీన్ చాలు సినిమాకు! బాక్సాఫీస్ రఫ్ఫాడించేస్తుంది.. అంటూ మాస్ డైలాగ్స్ విసురుతున్నారు. సినిమాలో డైలాగ్స్ అయితే వేరే లెవెల్ అని, ప్రతి ఒక్కరికీ ఇంటర్వెల్ చూడగానే గూస్ బంప్స్ పక్కా అంటున్నారు. సీఎంతో పుష్ప సీన్ అదిరిపోయిందని, ఇది బన్నీ ఊచకోత అని చెబుతున్నారు. జాతర సీన్ అయితే వేరే లెవెల్ అంటున్నారు.
పుష్ప యాక్షన్ సీక్వెన్స్, జాతర సీన్ చూసి కళ్ళలో నీళ్ళొచ్చాయి, ఆస్కార్ అంతే.. ఇవీ థియేటర్స్ వద్ద ప్రేక్షకుల నోట వినిపిస్తున్న మాటలు. అయితే కొందరు మాత్రం సినిమాపై కాస్త నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తుండటం చూడొచ్చు. హీరో బాడీ లాంగ్వేజ్ ఓవర్ అనిపించిందని, కొన్ని సీన్స్ చూస్తూనే కెజీఎఫ్ చూస్తుంటే ఫీల్ వచ్చిందని చెబుతున్నారు. ఒక బలమైన ఘర్షణ పెద్దగా ఉన్నట్టు అనిపించదు. బన్నీ రోల్ ని హైలైట్ చేయడానికి పలు ఎపిసోడ్స్ ఉన్నట్టు ఉంటాయి తప్పితే ఒక సరైన లైన్ లో కథ సాగినట్టు అనిపించదు అని అంటున్నారు. సెకండాఫ్‌లో ఫాహద్ ఫాజిల్ రోల్ సెకండాఫ్ లో చాలా వరకు మాయం అయ్యిపోయింది. వీటితో పాటుగా సినిమా మొదలుకి, ఎండింగ్ కి పర్ఫెక్ట్ ముగింపు దర్శకుడు ఇచ్చి ఉంటే బాగుండేది అని పబ్లిక్ టాక్.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.