Eyy Bidda Idhi Naa Adda Song : ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా.. బన్నీ ఊర మాస్
Eyy Bidda Idhi Naa Adda Song : అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతోన్న పుష్ప సినిమా మీద అందరికీ అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా పుష్పను రూపొందిస్తున్నారు. మొన్నటి వరకు కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. హిందీ భాషలో పుష్ఫను ఎవ్వరూ కొనేందుకు ముందుకు రావడం లేదని ఇన్ని రోజులు రూమర్లు వచ్చాయి. పుష్పను కేవలం దక్షిణాది రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారని టాక్ వినిపించింది. మొత్తానికి బన్నీ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది.
దానికి తగ్గట్టే కొన్ని రోజులు హిందీ పోస్టర్లను విడుదల చేయలేదు. దీంతో అందరూ బలంగా నమ్మేశారు. ఇక హిందీలో పుష్ప విడుదల కాదు. నేరుగా టీవీల్లో,యూట్యూబ్ చానెల్లో డబ్బింగ్ రూపంలో వెళ్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మళ్లీ గాడిలోకి పడింది. హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయట. అయితే ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్పీడు పెంచేశారు. తాజాగా మాస్ సాంగ్ను వదిలారు.

Allu Arjun Pushpa Eyy Bidda Idhi Naa Adda Song Out
Eyy Bidda Idhi Naa Adda Song మాస్ లుక్కులో బన్నీ
ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ బన్నీలోని మాస్ యాంగిల్‌ను చూపించారు. పుష్ప రాజ్ పాత్ర ఎలా ఉండబోతోంది.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదుగుతాడు అీని చూపించేశారు. ఇందులో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ ఊర మాస్ లుక్కులో కనిపిస్తున్నాడు. ఈ పాటను చూస్తుంటే.. ఆ ఏరియాకు పుష్ప రాజ్ కింగ్ అవుతాడనిపిస్తోంది. అందుకే అడ్డా, బిడ్డా.. ఆ పక్క.. ఈ పక్క అంతా నేదు.. ఆకాశం ముక్క కూడా నాదే అంటున్నాడు. గణేష్ మాస్టర్ ఈ పాటను గ్రాండ్‌గా కొరియోగ్రఫీ చేశాడు.
