Pushpa First Day Collections : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన మూడో సినిమా పుష్ప. ఇప్పటికే ఈ కాంబోలో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చి బాక్సాఫీసును గడగడలాడించాయి. దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇద్దరూ జతకట్టారు. ఈసారి పుష్ప ది రైజ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మూడు గంటల పాటు ప్రేక్షకులను మరోలోకానికి తీసుకెళ్లారు. పుష్పలో రెండో పార్ట్ కూడా ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ పార్ట్ అద్భుతంగా ఉందంటూ రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన థియేటర్లు అన్నింట్లోనూ ఫుల్ రష్ ఉంది.
దీన్ని బట్టే చెప్పొచ్చు.. పుష్ప సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది అంటే అర్థం చేసుకోవచ్చు.. పుష్పకు ఎంత క్రేజ్ ఉందో.ఒక్క నైజాం, ఆంధ్రా ఏరియాలోనే 1150 థియేటర్లలో సినిమా రిలీజ్ అయింది. పక్క రాష్ట్రాలు అయిన కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, నార్త్ ఇండియా అన్ని ప్రాంతాల్లో కలిపి మరో 1200 థియేటర్లలో సినిమా రిలీజ్ అయింది. విదేశాల్లో కనీసం 600 థియేటర్లలో రిలీజ్ అయింది.
పుష్ప సినిమాకు నైజాంలోనే అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే సుమారు 4 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో నైజాంలో 36 కోట్లు, సీడెడ్ లో 18 కోట్ల బిజినెస్ జరిగింది. ఆంద్రా మొత్తంలో మరో సుమారు 50 కోట్ల వరకు బిజినెస్ జరిగింది.అంటే.. కేవలం ఏపీ తెలంగాణ మాత్రమే తీసుకుంటే.. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
వేరే రాష్ట్రాల్లో మరో 20 కోట్లు, విదేశాల్లో 13 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే.. ప్రీ బిజినెస్ గానే.. పుష్ప సినిమాకు 130 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందన్నమాట.ఇక ఫస్ట్ డే కలెక్షన్ల విషయానికి వస్తే.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 30 కోట్ల రూపాయలను పుష్ప వసూలు చేసిందట. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలుపుకుంటే.. 40 కోట్లకు పైనే వసూళ్ల సాధించినట్టు తెలుస్తోంది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.