Intinti Gruhalakshmi 18 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 డిసెంబర్ 2021, శనివారం ఎపిసోడ్ 506 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆవేశంతో నందు.. తన పెళ్లి శుభలేఖను చించబోతాడు. దీంతో తులసి అడ్డుకుంటుంది. తప్పండి.. శుభలేఖను అలా చించకూడదు. మీకు గుర్తుందా.. అప్పట్లో మన శుభలేఖను అత్తయ్య గారు మంటల్లో వేశారు. అందుకేనేమో మన జీవితం ఇలా అయింది. కనీసం లాస్య జీవితం అయినా బాగుండాలి.. అని అంటుంది తులసి. నాకెందుకు ఈ విషయం చెప్పలేదు తులసి అంటాడు నందు. రెండు రోజుల్లో సర్జరీ అని నాకెందుకు చెప్పలేదు అంటాడు నందు. నేను మీకు చెబుదామనే అనుకున్నా కానీ… లాస్య ముఖంలో ఉన్న సంతోషం చూసి చెప్పలేకపోయాను అంటుంది తులసి.
ఎప్పుడు సర్జరీ అంటాడు నందు. మీరు పెళ్లిపీటలు ఎక్కే రోజునే నేను హాస్పిటల్ బెడ్ మీద ఉంటాను. ఆరోజే నాకు సర్జరీ అని చెబుతుంది తులసి. దీంతో నందు షాక్ అవుతాడు. నా పెళ్లికి నువ్వు వచ్చినా రాకున్నా.. నీకు ఆపరేషన్ జరిగినప్పుడు నేను నీ పక్కన ఉండాలి అంటాడు నందు. మీరు పక్కన ఉండి చేసేదేం ఉండదు అంటుంది తులసి. దీంతో నా పెళ్లికి ఇంకో ముహూర్తం దొరుకుతుందా అంటాడు నందు. నాకు నీకన్నా ఈ పెళ్లి అంత ముఖ్యమేమీ కాదంటాడు. దీంతో మళ్లీ మొదటికొచ్చారు ఏంటండి అంటుంది తులసి. ఈ విషయంలో మాత్రం నువ్వు ఎంత చెప్పినా వినను అంటాడు నందు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తులసి బెడ్ మీద పడుకుంటుంది. శృతి వచ్చి తనను లేపుతుంది. సాయంత్రం అనగా పడుకున్నారు లేవండి అంటుంది. మనసు నిండా సమస్యలే ఆంటి.. అలసిపోతున్నారు అంటుంది శృతి.
భోం చేయండి అని ప్లేట్ పట్టుకొని తీసుకొస్తుంది శృతి. తినండి.. అని ప్లేట్ ఇస్తుంది. దీంతో తులసి భోజనం చేస్తుంది. బెడ్ మీద ఉన్న శుభలేఖను చూస్తుంది శృతి. ఆంటి ఆ శుభలేఖ అక్కడెందుకు అంటుంది శృతి. కానీ.. అది నన్నేం చేస్తుంది అంటుంది తులసి. దీంతో శృతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇంతలో తులసికి తన తల్లి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ ఎలా ఉన్నావమ్మా అంటుంది. నీ కష్టాలు చూసి తట్టుకోలేకపోతున్నాను అమ్మా అంటుంది. నాకు క్యాన్సర్ ఉందనే విషయం చెప్పకపోవడం తప్పే అంటుంది. నన్ను చూడటానికి నువ్వు రాకూడదు అమ్మ. నీ అల్లుడు లాస్యను రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు.. నువ్వు వచ్చావంటే అక్షింతలు వేయాల్సి ఉంటుంది.. అని చెబుతుంది తులసి.
మరోవైపు నందు, లాస్య.. ఇద్దరూ కారులో వెళ్తుంటారు. కాసేపు సరదాగా గడుపుదాం అంటే.. వద్దు ఇంటికి వెళ్దాం అంటాడు నందు. ఎందుకు అర్జెంట్ గా వెళ్లి తులసిని చూడాలా అంటుంది లాస్య. అదేం లేదు అంటాడు. దీంతో తను చెప్పిన చోటుకు తీసుకెళ్లు అంటుంది లాస్య.
మరోవైపు మీ అమ్మ గారు మీకోసం పంపించారు అని అంకిత ఏదో మూటను ఇస్తుంది. దాంట్లో అక్షింతలు ఉన్నాయని చెబుతుంది. నీ ఆరోగ్యం కుదుటపడటం కోసం మీ అమ్మ దేవుడికి మొక్కకుందట అని చెబుతుంది అంకిత. ఇంతలో లాస్య, నందు వస్తారు. అందరినీ పిలుస్తుంది లాస్య.
ముందు ఈ స్వీట్లు తీసుకోండి అంటుంది. ఏంటి విశేషం అంటుంది అనసూయ. నిన్న వెడ్డింగ్ కార్డుతో పాటు అందరి నోళ్లు నిన్న తీపి చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు. అందుకే ఇప్పుడు స్వీట్లు తెచ్చాను అంటుంది. ఒక్కొక్కరికీ ఇవ్వబోతుంది కానీ.. ఎవ్వరూ తీసుకోరు.
మీరు ఎవ్వరు తినకున్నా.. తులసి మాత్రం తింటుంది.. అంటుంది లాస్య. అందరికంటే ముందు నువ్వు నోరు తీపి చేసుకోవాలి. ముందు నువ్వు తిను అంటుంది. మరి నువ్వు తిను కూడా తిను అంటుంది లాస్య. దీంతో కొంచెం స్వీట్ తీసుకొని తింటుంది తులసి.
కట్ చేస్తే.. అనసూయకు తన కొడుకు నందు, లాస్య మీద తీవ్రంగా కోపం వస్తుంది. ఓ పక్క తులసి ఆరోగ్యం బాగోలేకపోతే.. దీనికి పెళ్లి ఏర్పాట్లు చేయాలా అంటూ కోపం తెచ్చుకుంటుంది. ఇంతలో తులసి వచ్చి అనసూయ అనే మాటలకు నవ్వుకుంటుంది. ఏంటత్తయ్యా.. పెళ్లి పనులతో బిజీగా ఉన్నట్టున్నారు అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.