Allu Arjun Pushpa Movie Trailer postponed
Pushpa Movie Trailer : పుష్ప ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న తెలుగు సినీ అభిమానులకు చిత్రం బృందం గట్టి షాక్ ఇచ్చింది. చిత్ర ట్రైలర్ నేడు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల అవ్వాలసి ఉండగా అందరికీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లుతూ.. పలు సాంకేతిక కారణాల వల్ల మూవీ ట్రైలర్ ను ఇప్పుడు విడుదల చేయడం లేదని ఆలస్యంగా ప్రకటించింది. అల్లు అభిమానుల అందరికీ క్షమాపణలు చెప్పిన చిత్ర బృందం… త్వరలోనే ట్రైలర్ విడుదలపై అధికారంగా ప్రకటిస్తామని తెలిపింది.అయితే ట్రైలర్ పోస్ట్ పోన్ పై దారుణంగా హార్ట్ అయిన అల్లు అభిమానులు చిత్ర బృందం పై విరుచుకు పడుతున్నారు. చివరి నిమిషంలో వాయిదా వేస్తారా అంటూ చిత్ర బృందాన్ని బన్నీ అభిమానులు ఏకి పారేస్తున్నారు.
నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీస్ బ్యానర్ ను ట్యాగ్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి తెగ హడావిడి చేసి ఆఖరికి ఇలా చేస్తారా అంటూ సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 17 న సినిమా విడుదల విషయం లోనూ ఇలాగే చేస్తారా అంటూ నిలదీస్తున్నారు.ఇటీవల విడుదల అయిన పుష్ప సినిమా టీజర్ మూవీపై అంచనాలను రెట్టింపు చేసింది. లుంగీ కట్టుతో బన్నీ ఊర మాస్ గెటప్‌లో ఉర్రూతలూగించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో బన్నీ రెచ్చిపోయి నటించాడని చెప్పొచ్చు.
Allu Arjun Pushpa Movie Trailer postponed
చిత్తూరు యాసలో తగ్గేదే లే అంటూ బన్నీ చెప్తున్న డైలాగ్స్ కు థియేటర్లో విజిల్స్ పడటం ఖాయంగానే కనిపిస్తోంది. బన్నీ – సుకుమార్ కలయికలో 2 భాగాలుగా రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా.. సమంత స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. టాలెంటెడ్ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించాగా.. సునీల్, యాంకర్ అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 17న హిందితో పాటు దక్షిణాది నాలుగు భాషల్లో ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
This website uses cookies.