Home » Entertainment » Samantha Pan India Yashoda Movie Shooting Start
Entertainment

Samantha : యశోదాగా రాబోతున్న సమంత.. షూట్ ప్రారంభమైన పాన్ ఇండియా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 6, 2021, 5:40 pm
Advertisement

Samantha : టాలీవుడ్ యాపిల్ బ్యూటీ సమంత.. విడాకుల అనంతరం వ‌రుస సినిమాలకు సైన్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తోంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ సీజన్ 2 తో పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందిన సమంత.. గుణ శేఖర్ దర్శకత్వంలో తాను నటిస్తోన్న శకుంతల సినిమాను ఇటీవలే పూర్తి చేసేసింది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఇటీవలే ఓ హాలీవుడ్ సినిమానూ అనౌన్స్ చేసిన సామ్ తెలుగు, తమిళ్ బైలింగ్వేల్ గా తెరకెక్కనున్న సినిమాకు ముహూర్తం పెట్టేసింది.సామ్ ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతకాంపై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించే సినిమా నేటి నుంచి ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘యశోద’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ.

Advertisement

. చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సమంతాకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా.. ఈ చిత్రాన్ని… తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలోనూ తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది. ఈ పాన్ ఇండియా చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించ నున్నారు.సమంతా ఇప్పటికే మహిళ ప్రాధాన్యత ఉన్న సినిమాగా తెరకెక్కుతోన్న శాకుంతలంలో నటిస్తుండగా.. తాజాగా యశోద మూవీలో కూడా అలాంటి పాత్రలోనే మెరవనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం థ్రిల్లర్ జాన‌ర్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది.

samantha Pan india Yashoda movie Shooting start

Advertisement

Samantha పాన్ ఇండియా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీలో సామ్

వచ్చే ఏడాది మార్చి నెల వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సమంత.. అక్కినేని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి నాలుగేళ్ల తిరగకముందే బయటికొచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. విడాకులు అనంతరం సామ్ కానీ.. అక్కినేని కుటుంబం కానీ ఈ విషయంపై గురించి కానీ ఎక్కడా మాట్లాడటానికి ఇష్ట పడలేదు. విడాకుల కారణంగా సామ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుందేమో అనుకున్న అభిమానుల ఊహ గానాలకు చెక్ పెడుతూ బడా చిత్రాలకు వరుసగా సైన్ చేస్తూ తన దూకుడును కొనసాగిస్తోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి