Pushpa Official Trailer : పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్.. ఎట్టకేలకు సినిమా ట్రైలర్ విడుదల..

 Authored By mallesh | The Telugu News | Updated on :6 December 2021,9:57 pm

Pushpa Official Trailer : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఫిల్మ్ ‘పుష్ప’. రెండు పార్ట్‌లు గా వస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ విడుదల పోస్ట్ పోన్ చేసినట్లు పేర్కొన్న మేకర్స్ .. తాజాగా విడుదల చేసి ప్రేక్షకులకు, సినీ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో టైటిల్ రోల్ పుష్పరాజ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్లే చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బన్నీకి జోడీగా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తుండగా, భారీ తారగణమే సినిమాలో ఉంది. సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్‌లో బన్నీ నెవర్ బిఫోర్ మాస్ అవతార్‌లో కనిపించారు. అయితే, ట్రైలర్ చూసిన తర్వాత బన్నీ ద్విపాత్రాభినయం చేశాడేమోననే అభిమానులు చర్చించుకుంటున్నారు. కుడి భుజం వంగిపోయిన ‘పుష్ప’రాజ్‌గా బన్నీ ఒక పాత్రలో.. మరో పాత్రలోనూ బన్నీ కనిపిస్తారేమోనని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇకపోతే ట్రైలర్‌లో రివీల్ చేసిన డైలాగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ సెటిల్డ్‌గా ఉండబోతున్నదని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మంగళం శ్రీనుగా సునీల్, దాక్షాయణిగా అనసూయ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది.

Allu Arjun Pushpa Official Trailer Released

Allu Arjun Pushpa Official Trailer Released

Pushpa Official Trailer : బన్నీ నెవర్ బిఫోర్ మాస్ అవతార్..

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమా విజ్యువల్ ట్రీట్‌గా ఉండబోతుందని మూవీ మేకర్స్, మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బన్నీ, రష్మిక మందనల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ఇక ఇందులో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతుంది. ఐటెం సాంగ్‌లో సమంత బన్నీతో చిందేయనుంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి